Published On:

Varahi Navaratri in Indrakeeladri: దుర్గమ్మ సన్నిధిలో నేటి నుంచి వారాహి నవరాత్రులు!

Varahi Navaratri in Indrakeeladri: దుర్గమ్మ సన్నిధిలో నేటి నుంచి వారాహి నవరాత్రులు!

Varahi Navaratri Celebration Started in Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి వారాహి నవరాత్రులు, ఆషాడ సారె సమర్పణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జులై 4 వరకు వారాహి నవరాత్రులు, నేటి నుంచి జులై 24 వరకు వరకు అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ ఈవో శీనా నాయక్ చేతుల మీదుగా అమ్మవారికి మొదటి సారెను సమర్పించారు.

 

ఇక నేటి నుంచి జులై 24 వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీర, సారె సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయంలోని మహా మండపంలోని 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడే అమ్మవారికి సారె సమర్పణ జరుగుతుంది. సారెలో భక్తులు అమ్మవారికి చీర, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్లు, కొబ్బరికాయ, ఒడి బియ్యం, నిమ్మకాయలు వంటివి సమర్పిస్తారు. స్థాయిని బట్టి బంగారం, వెండి ఆభరణాలు కూడా చెల్లించుకుంటారు. జూన్ 29న కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తారు. జులై 4న పూర్ణాహుతి కార్యక్రమంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఇక జులై 8 నుంచి 10 వరకు శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తారు.

 

ఇవి కూడా చదవండి: