Last Updated:

Cm Jagan : చంద్రబాబు మనుషులను చంపేసి మానవతావాదిగా మాట్లాడతాడు : సీఎం జగన్

చంద్రబాబునాయుడు మనుషులను చంపేసి మళ్ళీ మానవతావాదిగా మాట్లాడతాడని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. మంగళవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.

Cm Jagan : చంద్రబాబు మనుషులను చంపేసి మానవతావాదిగా మాట్లాడతాడు : సీఎం జగన్

Cm Jagan : చంద్రబాబునాయుడు మనుషులను చంపేసి మళ్ళీ మానవతావాదిగా మాట్లాడతాడని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. మంగళవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు.

కందుకూరులో ఇరుకైన సందులో మీటింగు పెట్టి డ్రోన్ షాట్స్ కోసం 8మందిని చంపేశాడు.గుంటూరులో మళ్ళీ మీటీంగ్ పెట్టి కొత్త సంవత్సరంలో రక్త దాహం తీరక మరో ముగ్గురిని చంపేశాడు.చనిపోయిన వాళ్ళను తనకోసం త్యాగం చేశాడంటాడు.దీనిపై దత్తపుత్రుడు ప్రశ్నించడని విమర్శలు గుప్పించారు. వేలల్లో టోకెన్స్ ఇచ్చి సభకు రమ్మని వస్తే చీరలు ఇస్తామని చంద్రబాబు వచ్చే వరకూ చీరలివ్వలేదు.అరకొర చీరలు కోసం తొక్కిసలాట జరిపి బలితీసుకుని, ముసలికన్నీరు కారుస్తాడు. చంద్రబాబుది వంకరబుద్ది.చంద్రబాబు హయాంలో రైతులను నట్టేట ముంచాడు.జాబురావాలంటే బాబురావాలన్నాడు.. సిఎం అయిన చంద్రబాబు మళ్ళీ వాళ్ళందర్నీ మోసం చేసాడు.తన మేనిఫెస్టోను బాబు చెత్తబుట్టలో పడేశాడు. మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలు ఓ లెక్కా అని జగన్ అన్నారు.

దోచుకో, పంచుకో , దాచుగో అనేది చంద్రబాబు తీరని జగన్ విమర్శించారు. దత్తపుత్రుడుని చంద్రబాబు నమ్ముకుంటే., మీ బిడ్డ జగన్ ఎస్సీ,బిసీ, మైనార్టీలను నమ్ముకున్నాడని అన్నారు. పొరపాటు జరిగితే రాష్ట్రంలో పేదలు అన్యాయం అయిపోతారని, ఇంకా మంచిచేసే అవకాశం తనకు ఇవ్వాలని జగన్ కోరారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయాలను పెన్షన్ గా అందించేవారన్నారు.కొత్తగా రాష్ట్రంలో 44, 543 కొత్త బియ్యం కార్డులను అందజేస్తామని జగన్ ప్రకటించారు. కొత్తగా 14,401 మందికి ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తున్నామని జగన్ వివరించారు.

ఇవి కూడా చదవండి: