Ambati Rambabu : పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని కాపాడలేడు.. మంత్రి అంబటి రాంబాబు
పవన్, బాబుల పరామర్శలు ఎందుకో అర్ధం కావడం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదేమీ ఆశ్చర్చకరమైన పరిణామం కాదని.. బాబుకు జనసేన పార్టీ బీ టీమ్
Ambati Rambabu : పవన్, బాబుల పరామర్శలు ఎందుకో అర్ధం కావడం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదేమీ ఆశ్చర్చకరమైన పరిణామం కాదని.. బాబుకు జనసేన పార్టీ బీ టీమ్ లాంటిదని రాంబాబు వ్యాఖ్యానించారు. వారి చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని.. తెలుగుదేశం పరిరక్షణ కోసమేనన్నారు. టీడీపీ, జనసేన వేర్వేరుగా ఎప్పుడూ లేవన్నారు. మరణాలకు పోలీసులు కుట్ర చేశారంటూ బుద్ధిలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మారూట్ మ్యాపే బీజేపీ ఇవ్వాలన్న పెద్దమనిషి ఈ రూట్లోకి ఎందుకు వెళ్లాడు? చంద్రబాబుతో కలవడానికి బీజేపీ ఆయనకు రూట్ మ్యాప్ ఇచ్చిందా అంటూ అంబటి ప్రశ్నించారు. 11 మంది మరణంపై పవన్ మాట్లాడకపోవడం దారుణమన్న ఆయన.. బీజేపీతో వుంటూ చంద్రబాబుతో కలవడానికి పవన్‌కు సిగ్గులేదా అంటూ నిలదీసారు. ఎంతమంది వచ్చినా సీఎం జగన్‌ను కదపలేరని రాంబాబు స్పష్టం చేశారు. ఈ పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. భారతదేశానికి స్వతంత్రం తరువాత కోట్లాదిరూపాయలను పేదప్రజలకు నేరుగా అందించింది జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. టీడీపీ, జనసేన రెండు వేర్వేరు పార్టీలు కావు. టీడీపీని కాపాడేందుకే జనసేన పుట్టిందని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాల పరిరక్షణ కోసమే జోవో నెంబర్ 1 ని జారీ చేశామని అంబటి తెలిపారు. నిబంధనల ప్రకారం ఎవరైనా సభలు నిర్వహించుకోవచ్చునని చెప్పారు.
కాపు సోదరులు పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మోసపోకండి. వయసు సంబంధిత సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని అంబటి ఆరోపించారు. బాబు, పవన్ కలిసి వస్తే ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ ఎంత గగ్గోలు పెట్టినా వైసీపీని ఓడించలేరని అంబటి పేర్కొన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో కలిపేశారని.. పార్టీని నడపలేకపోతే జనసేనను పవన్ టీడీపీలో కలిపేయాలని అన్నారు.చంద్రబాబుకు రాజకీయ మరణం తప్ప మరొకటి లేదని అంబటి జోస్యం చెప్పారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ కాపాడలేరని టీడీపీ పనిఅయిపోయిందన్నారు.
సుమారు రెండున్నర గంటల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. అనంతరం చంద్రబాబు, పవన్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఇటీవల తీసుకువచ్చిన జీవో నంబర్ 1ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలుత పవన్ మాట్లాడుతూ ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్నారు. ఈ సందర్భంగా ఏపీలో వైకాపా అరాచకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, శాంతిభద్రతలు తదితర అంశాలపై చర్చించామని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లకుండా ప్రతిపక్ష నేతలను నియంత్రించేందుకే జీవో నంబర్ 1 పేరుతో చీకటి జీవో తెచ్చారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి…
Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ
Ap stampede issues : కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలపై విచారణ కమిటీ..
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/