Delhi CM Arvind Kejriwal: తప్పుడు సాక్ష్యాలను కోర్టుల్లో సమర్పించినందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై ఆమ్ ఆద్మీ పార్టీ తగిన కేసులు నమోదు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం తెలిపారు. ఈ కేసులో సీబీఐ తనకు సమన్లు పంపిన మరుసటి రోజే.. తాను అవినీతికి పాల్పడితే ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదని కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ ఎదుట హాజరవుతానని కేజ్రీవాల్ తెలిపారు.
ఆప్ దేశానికి ఆశాకిరణంగా ఆవిర్భవించిందని, అందుకే దానిని తుంగలో తొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. గత 75 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని టార్గెట్ చేసిన విధంగా మరే పార్టీని టార్గెట్ చేయలేదన్నారు.రేపు వాళ్ళు (సిబిఐ) నన్ను పిలిచారు, నేను తప్పకుండా వెళ్తాను, నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడు మరియు దొంగ అయితే, ఈ ప్రపంచంలో నిజాయితీపరుడు ఎవరూ లేరని.. బీజేపీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తామంటూ నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తోంది. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయాలని సీబీఐని బీజేపీ ఆదేశిస్తే, సీబీఐ వారి సూచనలను కచ్చితంగా పాటిస్తుందని కేజ్రీవాల్ అన్నారు.
తాము తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీ అద్భుతమైన పాలసీ అని, ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో బాగా పనిచేస్తోందని ఆప్ కన్వీనర్ నొక్కి చెప్పారు. తన మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా 14 ఫోన్లను ధ్వంసం చేశారని వారు ఆరోపిస్తున్నారని, అయితే వాస్తవం వేరుగా ఉందన్నారు.100 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయని, అయితే ఆ డబ్బు ఎక్కడిదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 400కు పైగా దాడులు నిర్వహించారు.. ఆ డబ్బు ఎక్కడిది? గోవా ఎన్నికల్లో డబ్బు వాడారని చెప్పారు. ప్రతి గోవా వ్యాపారిని ప్రశ్నించారు. కానీ ఏమీ దొరకడం లేదని అన్నారు.