NEET-UG Paper Leak Case: బీహార్‌లో నీట్-యుజి పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం , పాట్నాకు చెందిన మనీష్ ప్రకాష్ మరియు అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మొదటి అరెస్టులు ఇవే కావడం గమనార్హం.
ఆరు కేసులను విచారిస్తున్న సీబీఐ..(NEET-UG Paper Leak Case)
నీట్ పరీక్షకు ఒక రోజు ముందు, మే 4న బీహార్‌లోని పాట్నాలోని లెర్న్ ప్లే స్కూల్‌తో సంబంధం ఉన్న బాలుర హాస్టల్‌లో అశుతోష్ సహాయంతో మనీష్ ప్రకాష్ అభ్యర్థులకు లీక్ అయిన పేపర్లు మరియు సమాధానాల కీలను ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి అక్కడ లీకైన ప్రశ్నపత్రం పాక్షికంగా కాలిపోయింది.సీబీఐ అధికారులు విచారణ అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీక్ అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన ఆరు కేసులను సీబీఐ విచారిస్తోంది. ఆరు కేసుల్లో ఒక్కొక్కటి బీహార్, గుజరాత్, మహారాష్ట్రలకు చెందినవి కాగా, మూడు రాజస్థాన్‌కు చెందినవి.దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ మరియు ఇతర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా NEET-UG నిర్వహిస్తారు.ఈ ఏడాది పరీక్ష మే 5న విదేశాల్లో 14 సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.