Site icon Prime9

ED charges against KCR: ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్‌కు ముందే తెలుసు.. ఈడీ

ED charges against KCR

ED charges against KCR

ED charges against KCR: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ చెప్తోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

కేసీఆర్  తెలుసుకున్నారు.. (ED charges against KCR)

ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి..కేసీఆర్‌కు ముందే సమాచారం ఉందన్నారు. కేసీఆర్‌కు ముందుగానే కవిత చెప్పినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని ఈడీ అధికారులు చెప్తున్నారు. మద్యం వ్యాపార వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ అధికారులు తెలిపారు.. కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ స్పందిస్తూ, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కవితను బయటకు పంపడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొంది. అలాగే ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా కేసీఆర్ పేరును ఈడీ వెల్లడించింది. గత రెండేళ్లలో కవిత 11 మొబైల్ ఫోన్లను ఉపయోగించారని, అందులో నాలుగు మొబైల్స్‌లోని సమాచారాన్ని ఆమె పూర్తిగా ధ్వంసం చేసిందని ఈడీ వెల్లడించింది. ఈ వాదనలు విన్న న్యాయస్థానం కేసుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Exit mobile version