Union Budget App: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న యూనియన్ బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్నారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఐదోసారి. దీంతో సమయం దగ్గరపడుతున్న కొద్ది బడ్జెట్ పై అంచనాలు, ఆశలు పెరిగిపోతున్నాయి.
వచ్చే ఏడాది ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల ముందు చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
గత రెండు ఎడిషన్లో మాదిరి ఈ సారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ మేరకు మంత్రి ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా తయారు చేసిన ట్యాబ్ ద్వారా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను చదివి వినిపిస్తారు.
కాగా, బడ్జెట్ విశేషాలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉంచేందుకు యూనియన్ బడ్జెట్ (Union Budget app) అనే యాప్ ను తీసుకొచ్చింది.
పార్లమెంట్ లో మంత్రి బడ్జెట్ ప్రసంగం లోని మొత్తం సమాచారం ఈ యాప్ లో చూడొచ్చు. అదేవిధంగా Union Budget వెబ్ సైట్ లో కూడా బడ్జెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయి.
యూనియన్ బడ్జెట్ యాప్ ను ఆండ్రాయిడ్ డివైజ్ ల కోసం గూగుల్ ప్లేలో, ఐఓఎస్ డివైజ్ ల కోసం యాపిల్ స్టోర్లో అందుబాటులో ఉంచారు.
ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ యాప్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) ఆదేశాల మేరకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ ఐసీ) బడ్జెట్ యాప్ ను డిజైన్ చేసింది.
యాప్ ను డౌన్ లౌడ్ చేసే ముందు అది ఎన్ ఐసీ రూపొందించిచ యాప్ అనేది సరిచూసుకోవాలి.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్ లకు అనుగుణంగా ఈ యాప్ ను రూపొందించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఈ యాప్ లో బడ్జెట్ పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్ లో విడుదల చేస్తారు.
వాటితో పాటు బడ్జెట్ పూర్తి ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (డిజి), ఫైనాన్స్ బిల్లు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్ కు సంబంధించన డాక్యుమెంట్లను ఈ యాప్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా యాప్ లో బడ్జెట్ హైలెట్స్ పేరుతో ప్రత్యేక సెక్షన్ ను ఉంటుంది. అందులో నిర్మలా సీతారామన్ ప్రసంగం ముఖ్యమైన అంశాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టడం పూర్తి అయిన తర్వాత మొత్తం డాక్యుమెంట్లను అందులో అందుబాటులో ఉంటాయి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/