Site icon Prime9

Meta Lay offs: మెటా లో 4,000 మంది ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్దం

Meta Lay offs

Meta Lay offs

Meta Lay offs: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌లో మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు  రంగం సిద్దమయింది. కంపెనీ ఎక్కువ సామర్థ్యాన్ని సాధించాలనే మార్క్ జుకర్‌బర్గ్ లక్ష్యం వైపు ముందుకు సాగుతోంది.బుధవారం నుంచి ప్రారంభమయ్యే తాజా రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 4,000 మంది అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ప్రభావితం కావచ్చని సమాచారం.

13 శాతం ఉద్యోగుల తొలగింపు..(Meta Lay offs)

మార్చిలో, జుకర్‌బర్గ్ తన కంపెనీ రాబోయే నెలల్లో 10,000 ఉద్యోగాలను తొలగిస్తుందని ప్రకటించారు.మెటా ఇప్పటికే దాదాపు 13 శాతం ఉద్యోగులను తగ్గించుకుంది.ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం అంతర్గత మెమోలో కంపెనీ ఉద్యోగాలు తగ్గించబడుతున్న సాంకేతిక బృందాల్లోని ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభిస్తుంది అని మెటా తెలిపింది.మెటా కొత్తగా పునర్వ్యవస్థీకరించబడిన టీమ్‌లు మరియు మేనేజ్‌మెంట్ సోపాన క్రమాలను కూడా ప్రకటిస్తుందని నివేదిక పేర్కొంది.

సిబ్బందిని 10వేలకు తగ్గించాలని..

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా బుధవారం కొత్త ఉద్యోగాల కోత గురించి వివరాలను ప్రకటిస్తుంది, ఇది నెలల తరబడి తగ్గింపు మరియు పునర్నిర్మాణ ప్రయత్నంలో భాగంగా, అనేక రకాల తొలగింపుల మధ్య 10,000 మంది ఉద్యోగులకు చేరుతుందని అని వాషింగ్టన్ పోస్ట్ ట్వీట్ చేసింది.జుకర్‌బర్గ్ మొత్తంగా మా జట్టు పరిమాణాన్ని సుమారు 10,000 కు తగ్గించాలని మరియు మేము ఇంకా నియమించుకోని 5,000 అదనపు సిబ్బందిని నిలిపివేయాలని మేము భావిస్తున్నాము అని చెప్పారు.గత ఏడాది నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను లేదా కంపెనీలో 13 శాతం మందిని తొలగించిన నాలుగు నెలల తర్వాత తాజా కోతలు వచ్చాయి.ఈ ఏడాది ఇప్పటివరకు 594 టెక్ కంపెనీలు 1,71,308 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1,052 టెక్ కంపెనీలు 1,61,411 మంది ఉద్యోగులను తొలగించాయి.

Exit mobile version