Nirmala Sitharaman’s son-in-law: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి బుధవారం బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ప్రతీక్ దోషితో వాంగ్మయి వివాహం జరిగింది.
ప్రధానమంత్రి కార్యాలయంలో..(Nirmala Sitharaman’s son-in-law)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి గుజరాత్ నివాసి మరియు 2014 నుండి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)తో అనుబంధం కలిగి ఉన్నారు. అతను ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో ఆఫీసర్-ఆన్-స్పెషల్ డ్యూటీ (OSD)గా చేస్తున్నారు. జూన్ 2019లో, దోషి జాయింట్ సెక్రటరీ స్థాయికి ప్రమోట్ అయ్యారు. ప్రతీక్ దోషి సింగపూర్ మేనేజ్‌మెంట్ స్కూల్ గ్రాడ్యుయేట్.గతంలో నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రతీక్ దోషి రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ వింగ్‌లో పనిచేస్తున్నారని పీఎంవో వెబ్‌సైట్ పేర్కొంది. ప్రతీక్ ప్రచారానికి దూరంగా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండరు.
సీతారామన్ కుమార్తె వాంగ్మయి మింట్ లాంజ్ బుక్స్ అండ్ కల్చర్ విభాగానికి ఫీచర్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీనుండి మాస్టర్స్ డిగ్రీని మరియు నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి జర్నలిజంలో ఎంఎస్ పట్టా పొందారు.కర్నాటకలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. హిందూ వివాహ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది, ఉడిపి ఆడమారు మఠానికి చెందిన పీఠాదిపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ పొలిటికల్ ఎకనమిస్ట్ . అతను జూలై 2014 మరియు జూన్ 2018 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ సలహాదారుగా మరియు క్యాబినెట్ హోదాలో పనిచేశారు.