Site icon Prime9

Nirmala Sitharaman : నిరాడంబరంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కుమార్తె వివాహం..

central minister nirmala sitharaman daughter marriage

central minister nirmala sitharaman daughter marriage

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాంగ్మయి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వివాహానికి అతికొద్ది మంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం అందుతుంది. గుజరాత్‌కు చెందిన వరుడు ప్రతీక్‌తో.. వాంగ్మయి వివాహం జరిగింది.  పూర్తి బ్రాహ్మణ సంప్రదాయంలో ఈ వేడుకను జరిపించారు.

ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పీఠాధిపతులు ఈ వివాహ క్రతువును నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవర్నీ ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి వధువు గులాబీ రంగు చీరను ఆకుపచ్చ బ్లౌజ్ తో ధరించింది. వరుడు తెల్లని పంచా, శాలువా ధరించాడు. అయితే ఈ పెళ్లి గురించి సీతారామన్‌ కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించకపోయినప్పటికి.. వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వాంగ్మాయి.. ప్రస్తుతం మింట్ లాంజ్ ఫీచర్స్ విభాగంలోని బుక్స్ అండ్ కల్చర్ సెక్షన్‌లో ఉద్యోగిగా ఉన్నారు. దీనికి ముందు ది హిందూలో ఫీచర్స్‌ రాసేవారు. నార్త్‌వెస్ట్రన్ మెడిల్లి స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి తన కుమార్తె వివాహాన్ని నిరాడంబరంగా జరిపించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Exit mobile version