Nara Lokesh : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తిరుపతిలోని యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ‘నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూశాను. ఇక బాల మామ గురించి చెప్పాలంటే ఎంతైనా నా మద్దుల మామయ్య. ఆయన అన్ స్టాపబుల్. బాలయ్య కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి షోకు మొదట ఉండేది నేనే’ అని లోకేశ్ అన్నారు.
అదే సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలంటే ముందు మంచి మనసు ఉండాలని.. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌లో ఆ మంచి మనసును చూశానన్నారు. ఇలాంటివారు రాజకీయాల్లో తప్పకుండా ఉండాలన్నారు. కాగా 20024 ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగే యోచనలో ఉంది టీడీపీ. ఈ నేపథ్యంలో పిలుపునివ్వడం, అందులోనూ ప్రత్యేకంగా మెగా బ్రదర్స్ గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేశ్. ఏపీని అభివృద్దిలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని తెలిపారు. మంగళగిరిలో ఓటమిపై మాట్లాడుతూ.. మంగళగిరిలో గతంలో టీడీపీ గెలిచిన దాఖలాలు రెండుసార్లేనని, టీడీపీ బలంగాలేని మంగళగిరిలో విజయం సాధించాలన్న పట్టుదలతో అక్కడ నుంచి పోటీ చేశానని లోకేశ్ తెలిపారు. మొదటి సారి ప్రజల అభిమానాన్ని పూర్తిస్థాయిలో పొందలేక పోయానని, ఫలితంగా ఓటమి చెందానని అన్నారు. అయితే, ఓడిపోయినప్పటికీ.. ఎన్నికల అనంతరం నుంచి మంగళగిరిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నానని, 2024లో మంగళగిరిలో టీడీపీ చరిత్ర తిరగరాస్తుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
మీరు స్లిమ్ కావడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా.. లోకేశ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నేను కొంచెం ఎక్కువగా తినేవాడినని, ప్రస్తుతం నేను ఇలా స్లిమ్‌గా ఉండటానికి కారణం.. కరోనా టైంలో నా సతీమణి బ్రహ్మణికి దొరికిపోవటమేనని చెప్పారు. కరోనా సమయంలో బ్రహ్మణి తన డైట్ మొత్తం మార్చేసిందన్న లోకేశ్.. రెండేళ్లు పొద్దున్నే లేపి పరుగెత్తించిందని తెలిపారు. తనకు అందించే ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుందని, నడవడం, వ్యాయామం చేయడం, ఆహారం తీసుకొనే విషయంలో నియంత్రణ కలిగి ఉండటం వంటి విషయాలపై బ్రహ్మిణి దగ్గరుండి చూసుకుందని లోకేశ్ అన్నారు. బ్రాహ్మిణి నా ఆహారం విషయంలో స్ట్రిక్‌గా ఉండటం వల్ల కొద్దిరోజులకు నాకు ఆ పద్దతి అలవాటైందని అన్నారు. పాదయాత్ర సమయంలో అప్పుడప్పుడు చీటింగ్ చేస్తుంటానని, కొంచెం అతిగా నచ్చిన ఫుడ్ తినేస్తుంటానని, బ్రాహ్మిణికి వెంటనే సమాచారం వెళ్తుందని, కొద్దిసేపటికే నాకు వాట్సాప్ మెస్సేజ్ వస్తుందని లోకేశ్ అన్నారు. ఆ మెస్సేజ్‌లో.. ఈరోజు బాగనే తిన్నావులే.. రేపు తినొద్దు.. చాలా నడవాలని చెబుతుందని లోకేశ్ చెప్పారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/