Poolice Rush to MP Avinash Reddy PA Home: ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రతో రాఘవ చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆయనను విచారించేందుకు శనివారం పులివెందులలోని రాఘవ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా వైసీపీ అధికారంలో ఉండగా వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనితలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఈ విషయమై మంగళగిరి, హైదరాబాద్‌లో అతడిపై పలు కేసులు ఉన్నాయి. అయితే కొంతకాలంగా వర్రా వీరారెడ్డి పరారీలో ఉండగా అతడి పట్టుకునేందుకు రాఘవ ఇంటికి వెళ్లారు. అతడు, వర్రా రవీంద్రారెడ్డితో చాటింగ్ చేసిన గుర్తించిన పోలీసులు విచారణ నిమిత్తం వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు రాఘవ తండరితో మాట్లాడారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో రాఘవను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో ఆయన వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని రాఘవ తరపు లాయర్ చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.