Site icon Prime9

Nara Lokesh: ఏపీలో కొత్త ఐటీ పాలసీ.. ఐదేళ్లల్లో 5 లక్షల ఉద్యోగాలు.. మంత్రి నారా లోకేశ్

IT Minister Nara Lokesh says 5 lakh jobs: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఐటీ అభివృద్ధి విషయంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లల్లో 5 లక్షల ఉద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయకత్వంలో ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. కానీ అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలనే ఉద్ధేశంతో చాలా స్పష్టంగా రాజధాని ప్రకటన చేశారన్నారు. ముఖ్యంగా ఐటీ మొత్తం విశాఖపట్నం వద్దకు తీసుకొస్తానని ఆనాడు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు చొరవతో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా దాదాపు 20 శాతం వరకు ఐటీ రంగంలో తెలుగు ప్రజలు ఉండడం గర్వకారణమన్నారు. కానీ ఏపీలో పనిచేసేందుకు సరైన వసతులు లేకపోవడం బాధాకరమన్నారు.

2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు. ఈ పరిశ్రమలను ఆనాడు ముందుచూపుతో తీసుకొచ్చి.. వైజాగ్‌ను ఫోకస్ ప్రాంతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. డేటా సెంటర్ పాలసీని ఆదానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఇందు కోసం భూ కేటాయింపులు కూడా జరిగిందని.. కానీ పలు కారణాలతో నిలిచిపోయిందన్నారు. ఇక, 2019 నుంచి 2024 మధ్యలో చూస్తే.. ఎలాంటి పరిణామాలు జరగలేదన్నారు. కనీసం కాంక్లేవ్ కూడా జరగలేదని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.

ఈ విషయంలో బాధకరమైన సంఘటన జరిగిందని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో ఓ రేస్ జరుగుతుండగా.. ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు తీసుకొస్తారని ఆనాడు ఓ మంత్రిని అడిగితే చాలా విచిత్రమైన సమాధానం చెప్పారన్నారు. ఆ ప్రశ్నకు ఆయన.. కోడి గుడ్డు పెట్టలేదనే చెప్పడంతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎగతాళిగా సమాధానం చెప్పారన్నారు. ఈ సంఘటన తర్వాత మంత్రి ఇలా కూడా ఉంటారనే విషయం చాలా వైరల్ గా మారిందన్నారు.

ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కంపెనీలను కలిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. గత ప్రభుత్వంలో ఉన్న నేతలు చాలా స్పష్టంగా కంపెనీల్లో వాటాలు అడిగారని తెలిసిందన్నారు. ఇలా వాటాలు అడగడం ద్వారా చాలా కంపెనీలు వెనక్కి వెళ్లాయని, ఐటీ కంపెనీలు కూడా వాటాలు అడుగుతాయా? అని ఆశ్చర్యం వేసిందన్నారు. సచివాలయం విషయంలో కూడా గత ప్రభుత్వం డ్రామాలు ఆడిందన్నారు. దీంతో ఆంధ్ర రాష్ట్ర యువకులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

ఎన్డీఐ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలతో మాట్లాడినట్లు చెప్పారు. కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు. టీసీఎస్ కంపెనీ విశాఖకు వస్తుందని, ఇప్పటికే ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్‌ను అడిగామని, 3 నెలల్లో తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు ఇన్ఫోసిస్ కూడా 6 నెలల్లో వస్తుందన్నారు. అలాగే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్, స్లార్ హోటళ్లు కూడా విశాఖకు రానున్నట్లు వెల్లడించారు.

Exit mobile version