Site icon Prime9

Nara Lokesh: ముగిసిన మంత్రి నారా లోకేశ్ పర్యటన

Nara Lokesh America Tour Updates: అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో భాగంగా లోకేశ్.. దాదాపు 100 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల కారణాలను వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అనుకూలతలు, చంద్రబాబు విజన్ తదితర విషయాలను ఆవిష్కరించారు.

మరోవైపు పరిశ్రమల ఏర్పాటు చేసేలా ఆ కంపెనీ ప్రతినిధుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి విజయవంతమయ్యారు. దాదాపుగా అన్ని కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే వచ్చే ఏడాది దావోస్‌లో నిర్వహించినున్న పెట్టుబడుల సదస్సులో మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకుముందు న్యూయార్క్‌లోని విట్ బై హోటల్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో లోకేశ్ సమావేశమయ్యారు.

పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు పర్మిషన్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఆసక్తికరంగా ఉందని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉంటుందని, రాష్ట్రాన్ని సందర్శించాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version