Artificial Intelligence: టెక్నాలజీ విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే టెన్షన్ ఎక్కువగా ఉందని ఓ సర్వే తేల్చింది. ఈ ఆందోళన వర్కింగ్ ప్రొఫెషనల్స్ కంటే విద్యార్థుల్లో ఎక్కువగా ఉందట. డిజిట్ రీసెర్చ్ లాబ్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. దాదాపు 3500 మంది టెక్ రంగంలోని నిపుణులు, విద్యార్థులతో ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఆర్టిఫిషియల్ ఇంటల్ జెన్స్ కు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోలేకపోతే తమ కెరీర్ పై ప్రభవం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
ఏఐను అవకాశంగా, మరో వైపు ప్రమాదకారిగా 59% మంది భావించారు. 11 శాతం మాత్రం ఏఐ కచ్చితంగా ప్రమాదమే అని, దాని వల్ల భవిష్యత్ లో పోటీ పెరిగి ఉద్యోగం పోయే అవకాశం ఉందని అనుకుంటున్నారు. 40% విద్యార్థుల్లో , 36% మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్లకు ఏఐ ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా సంచలనం చాట్‌జీపీటీ లాంటి టూల్స్‌తో 67% మంది ఎక్కువ తెలుసుకోగా.. 23% మంది ఓ మోస్తరుగా తెలుసుకున్నారు. 10% మంది అయితే ఇలాంటి టూల్స్ గురించి తెలుసుకోలేదు. ఏఐ, మెషీన్ లెర్నింగ్.. లాంటి న్యూ టెక్నాలజీ నేర్చుకోకపోతే కెరీర్ ఎదుగుదలపై ప్రభావం పడుతుందని 75% మంది నమ్మారు.
54 శాతం మంది భారత విద్యా వ్యవస్థలో క్రిటికల్ థింకింగ్, ప్రోబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకోగా.. డిజిటల్ అక్షరాస్యతలో స్ట్రాంగ్ బేస్ ఉండాలని 49 శాతం మంది, ఏఐ సంబంధిత సబ్జెక్టులను లెసెన్స్ లో యాడ్ చేయాలని 46 శాతం మంది, భవిష్యత్‌కు సరిగ్గా సిద్ధం అయ్యేందుకు ఏఐ లాంటి వాటిని అందిపుచ్చుకునేలా ఒకటి కంటే ఎక్కువ విభాగాలు నేర్చుకునేలా ప్రోత్సాహం ఇవ్వాలని 30 శాతం మంది భావిస్తున్నారు.
2023 డిజిటల్ రంగంలో వచ్చే మార్పును ముందుండి నడిపించేవి కృత్రిమ మేధ (ఏఐ), మల్టీ క్లౌడ్, క్వాంటమ్ కంప్యూటింగ్ లేనని హెచ్‌సీఎల్ టెక్నాలజీ తాజా నివేదికలో వెల్లడించింది. టెక్ ట్రెండ్స్ 2023 పేరుతో వచ్చిన ఈ నివేదికలో పలు విషయాలను వెల్లడించింది.
5జీ అప్లికేషన్స్ లీడ్ లో ఉండనున్నాయి. భవిష్యత్ లో టెలికాం కంపెనీలకు, కార్పొరేట్లకు మధ్య భాగస్వామ్యాలు పెరుగుతాయి. దీని వల్ల 5జీ అప్లికేషన్లు భారీగా పెరుగుతాయని తెలిపింది. ఈ ఏడాదిలో గమనించదగ్గ 10 టెక్నలాజికల్ ట్రెండ్స్ ను గుర్తించామని .. భవిష్యత్తుకు సిద్ధం కావడానికి కంపెనీలకు అవి ఉపయోగపడతాయి. 2023 లో ఏఐ, మల్టీ క్లౌడ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సస్టెయినబిలిటీ అప్లికేషన్లు కీలకంగా మారనున్నాయి.
ఇవి డిజిటల్ రంగంలో పెను మార్పులకు దోహదం పడతాయి. ఈ ఏడాదిలో ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీ స్థాయిలో జరుగనుంది. చాట్‌బాట్స్ నుంచి చిప్ పరిశ్రమలో హార్డ్‌వేర్ తయారీ వరకు ఏఐ ముందుంటుంది. రానున్న రోజుల్లో మల్టీ క్లౌడ్ కూడా జోరందుకుంటుంది. ప్రభుత్వ, పరిశ్రమ క్లౌడ్లు పెరుగుతాయి. 2027 నాటికి కార్పొరేట్లలో సగం మంది క్లౌడ్ సొల్యూషన్లను వినియోగిస్తారు.