Site icon Prime9

Realme 11 Pro: దేశీయ మార్కెట్ లో రియల్‌ మీ11 ప్రో సిరీస్ లు.. ధర, ఫీచర్లెలా ఉన్నాయంటే?

Realme 11 Pro

Realme 11 Pro

Realme 11 Pro: రియల్‌ మీ నుంచి సరికొత్త సిరీస్ లు దేశీయ మార్కెట్ లో విడుదలయ్యాయి. రియల్‌ మీ 11 ప్రో 5G, 11 ప్రో+ 5G పేరిట ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. కాగా, మే 10 న చైనా మార్కెట్‌లోకి విడుదల అయ్యాయి.

 

ధరలెలా ఉన్నాయంటే?(Realme 11 Pro)

రియల్‌ మీ 11 ప్రో 5జీ 8GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 23,999 గా కంపెనీ నిర్ణయించింది. 8GB + 256GB వేరియంట్‌ ధర రూ. 24,999లు గా ఉంది. 12GB + 256GB వేరియంట్‌ ధర రూ. 27,999 గా నిర్ణయించారు. ఈ 11 ప్రో సిరీస్ లు జూన్‌ 16 వ తేదీ నుంచి అమెజాన్‌, రియల్‌ మీ వెబ్‌సైట్‌లతో పాటు కొన్ని సెలెక్టడ్ రిటైల్‌ స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి.

మరో వైపు రియల్‌మీ 11 ప్రో+ 5Gలో 8GB + 256GB ధర రూ. 27,999 కాగా.. 12GB + 256GB ధర రూ. 29,999 గా ఉంది. ఈ వేరియంట్ జూన్‌ 15 నుంచి అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌ సహా సెలెక్టడ్ స్టోర్స్ లో అందుబాటులోకి ఉంటాయి. మరో వైపు వివిధ బ్యాంకు కార్డులపై రియల్‌మీ ప్రో+ 5జీ కొన్నవారికి అదనంగా రూ. 2 వేలు, రియల్‌మీ ప్రో+ పై అదనంగా రూ. 1,500 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

రియల్‌మీ 11 ప్రో సిరీస్‌ ఫీచర్లివే..(Realme 11 Pro)

రియల్‌మీ 11 ప్రో సిరసీ్ ఫీచర్లను చూస్తే.. రియల్‌ మీ 11, రియల్ మీ ప్రో+ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఓఎస్‌ ను కలిగి ఉన్నాయి. రెండు వేరియంట్లలో 6.7 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ+ (1,080×2,412 pixels) కర్వ్‌డ్‌ స్క్రీన్ ను ఇస్తున్నారు. 6 nm ఆక్టాకోర్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ ఉంది. 11 ప్రో ఫోన్‌లో 100 మెగా పిక్సెల్‌ కెమెరాను ఇస్తున్నారు. 11 ప్రో+ లో 200 మెగాపిక్సెల్‌ కెమెరా ఇచ్చారు. వీటిలో వరుసగా 16 మెగా పిక్సెల్‌, 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలో 5,000 mAh బ్యాటరీని అందుబాటులో ఉంది. అదే విధంగా ఈ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తోంది.

 

Exit mobile version