YouTube: దిగ్గజ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి నిబంధనలను మార్పు చేసింది. యూట్యూబ్ మానిటైజేషన్‌కు క్వాలిఫై అయ్యేందుకు ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. చిన్న కంటెంట్ క్రియేటర్స్ కూడా మానిటైజేషన్ టూల్స్‌ను పొందేందుకు ఈ రూల్స్ ను మార్చింది. ఈ మార్పుతో తక్కువమంది సబ్‌స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లు కూడా యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకునేందుకు వీలు కలుగుతుంది.
రూల్స్ ఎలా ఉన్నాయంటే?(YouTube)
కాగా, ఇప్పటి వరకు యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు అర్హత కావాలంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. దీంతో పాటు ఏడాదిలో కనీసం 4 వేల గంటల వీక్షణలు, చివరి 90 రోజుల్లో కనీసం 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ఖచ్చితంగా ఉండాలి. అయితే తాజాగా యూట్యూబ్ కొత్త మానిటైజేషన్ నిబంధనల ప్రకారం.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోస్ అప్‌లోడ్ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో 3 వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ అర్హతలు సాధించిన కంటెంట్ క్రియేటర్లు ఇకపై యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌కు అప్లయ్ చేసుకునేందుకు అవకావం కల్పించారు.
ముందు ఈ దేశాల్లో(YouTube)
ముందు ఈ కొత్త మానటైజేషన్ రూల్స్ ని అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియా దేశాల్లో యూట్యూబ్ తీసుకు వస్తోంది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే భారత్‌కు ఈ రూల్స్ ఎప్పుడు తీసుకువస్తారనేది మాత్రం తెలియ రాలేదు. అదే విధంగా చిన్న కంటెంట్ క్రియేటర్లు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ లాంటి టిప్పింగ్ టూల్స్‌తో పాటు ఛానెల్ మెంబర్‌షిప్స్ వంటి సబ్‌స్క్రిప్షన్ టూల్స్‌ను కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.