Chicken Price: పాకిస్తాన్‌లో కిలో చికెన్ ధర రూ.700.. ఎందుకు ఇలా పెరుగుతోంది?
ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్‌లో చికెన్ ధర భారీగా పెరిగింది. గత రెండు వారాల్లో, కిలో చికెన్ ధర ఏకంగా రెండు వందల రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భయం కూడా వ్యక్తమవుతోంది.
Chicken Price: ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్‌లో చికెన్ ధర భారీగా పెరిగింది. గత రెండు వారాల్లో, కిలో చికెన్ ధర ఏకంగా రెండు వందల రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భయం కూడా వ్యక్తమవుతోంది. చికెన్ ధర (Chicken Price) కొన్ని రోజుల క్రితం కిలో రూ.440-480 ఉండగా ప్రస్తుతం కిలో రూ.650-700గా ఉంది.
ఫీడ్ దొరక్కపోవడమే సమస్యకు కారణమా?
పాకిస్తాన్ పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన మొత్తంలో ఫీడ్ దొరక్కపోవడం వలన చికెన్ సరఫరా బాగా తగ్గిపోయి డిమాండ్ పెరిగిందని పౌల్ట్రీ రంగానికి సంబంధించిన వ్యాపారులు చెబుతున్నారు.
ఈ ఫీడ్ ను పాకిస్తాన్ విదేశాలనుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. కోళ్లను పెంచడానికి స్థానికంగా లభించే ఫీడ్ సరిపోదు .
దీనితో ఇది సరఫరా సంక్షోభానికి కారణమవుతుంది .దీనితో పౌల్ట్రీ ఫారాలు మూసివేయవలసి వస్తోంది.
కరాచీ ఓడరేవులో సోయాబీన్ మరియు కనోలాతో కూడిన 12 ఓడలు గత రెండున్నర నెలలుగా నిలిచిపోయాయి.
సాంకేతిక అభ్యంతరాలకారణంగా వీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు.
దీనితో ఫ్యాక్టరీలకు దాణా చేరడం లేదు. డిసెంబరు 6న మరో రెండు ఓడలు నెల రోజుల క్రితం అమెరికా నుంచి బయలుదేరాయి.
అయితే వీటి చెల్లింపులకు బ్యాంకులు ఆలస్యం చేస్తే ఇంకా ఇబ్బందులు పెరుగుతాయిని వ్యాపారులు చెబుతున్నారు.
చికెన్ తినడం మానేయండి అంటున్న మంత్రి
పౌల్ట్రీ మాఫియా కారణంగా పాకిస్తాన్ లో దిగుమతి చేసుకున్న సోయాబీన్ చౌకగా స్దానిక సోయాబీన్ ఖరీదుగా మారింది.
దీనితో వ్యాపారులు గత్యంతరం లేక దిగుమతులవైపే చూడవలసి వస్తోంది.
అయితే దిగుమతి చేసుకున్న దాణా జన్యుమార్పిడి చేసిందని, అది కోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనే భయాలు కూడా ఉన్నాయి.
దీనితో స్దానికంగా ఫీడ్ ను ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
మరి ఇటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా అంటే సందేహమే.
పాక్ ను వెంటాడుతున్న కష్టాలు
దిగుమతి చేసుకుంటున్న దాణా జీఎం.. అంటే జన్యుమార్పిడి చేసినది కాబట్టి అలాంటి ఫీడ్ తినే కోళ్లను ప్రజలు ఆహారంగా తీసుకోవద్దని.. చికెన్ తినడం మానేయాలని పాక్ మంత్రి అన్నారు.
మరి ఇటువంటి పరిస్దితుల్లో ప్రభుత్వం స్దానికంగా ఫీడ్ ఉత్పత్తిని ఏమేరకు ప్రోత్సహిస్తుందో చూడాలి.
చికెన్ తినడం మానేయాలని పాక్ పాకిస్తాన్ మంత్రి అన్న మాటలకు ఆ దేశ ప్రజలు కోపాన్ని ప్రదర్శించారు.
స్థానిక ఫీడ్ ని ఉత్పత్తి చేసే స్థితిలో పాక్ ఇప్పుడు లేకపోవడం కూడా ఆ దేశానికి ఎదురుదెబ్బే.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/