Fruit juices: పళ్ళ రసాలను ఎవరు తీసుకుంటే మంచిది
ప్రస్తుతం మనలో చాలా మంది ఆహారానికి బదులు పండ్ల రసాలను ఎక్కువ తీసుకుంటారు. అసలు పండ్ల రసాలను ఎవరు తాగితే మంచిది. ఎవరు ఎక్కువ తాగాలి ఇక్కడ తెలుకుందాం. పండ్ల రసాలలో ఎక్కువుగా చక్కెర, కేలరీలు మనకి అధికంగా దొరుకుతాయి.
Fruit juices: ప్రస్తుతం మనలో చాలా మంది ఆహారానికి బదులు పండ్ల రసాలను ఎక్కువ తీసుకుంటారు. అసలు పండ్ల రసాలను ఎవరు తాగితే మంచిది. ఎవరు ఎక్కువ తాగాలి ఇక్కడ తెలుకుందాం. పండ్ల రసాలలో ఎక్కువుగా చక్కెర, కేలరీలు మనకి అధికంగా దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకి ఒక ప్రయోజనం కూడా ఉంది. అది ఏంటంటే బరువును కూడా పెంచుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పళ్ల రసాలకు దూరంగా ఉంటే మంచిది. అలాగే వారు పళ్ళ రసాలు బదులుగా మీకు ఇష్టమైన కూరగాయల జ్యూస్లను తాగాలి. బరువు పెరాగలనుకునే వారు మాత్రం కచ్చితంగా పళ్ల రసాలను తీసుకోవాలి ఎందుకంటే వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి దీని వల్ల కొన్ని రోజుల్లోనే బరువు పెరిగిపోతారు.
మనలో కొంత మందికి జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే ఫైబర్ ఉన్న పదార్ధాలను తీసుకోవాలి. పండ్లలో ఫైబర్ చాలా తక్కువుగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను మెరుగు పడేలా చేసుకోవాలి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు మీరు ఏకంగా పండ్లనే తీసుకోవచ్చు.
మందులను వేసుకునే వారు పళ్ల రసాలను తక్కువ తాగడం మంచిది. పండ్లతో పాటు మందులను తీసుకుంటే మీ శరీరం పై ప్రభావం చూపుతుంది. కనుక పళ్ల రసాలను తక్కువ తాగండి. ఈ విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.