Last Updated:

MAD Square: వచ్చార్రోయ్.. మళ్లీ వచ్చార్రోయ్.. వీళ్లకు హారతి పట్టండ్రోయ్

MAD Square: వచ్చార్రోయ్.. మళ్లీ వచ్చార్రోయ్.. వీళ్లకు హారతి పట్టండ్రోయ్

MAD Square: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మ్యాడ్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బైనార్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. 2023 లో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రానుంది.

 

ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్  మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా నుంచి మరో  హుషారైన సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఇక ఇప్పుడు వచ్చార్రోయ్.. మళ్లీ వచ్చార్రోయ్.. వీళ్లకు హారతి పట్టండ్రోయ్ అంటూ సాగిన సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ మొత్తం భలే హుషారుగా ఉంది. లడ్డూ పెళ్లిలో ఈ ముగ్గురు హీరోలు ఎంత రచ్చ చేశారు.. ? పెళ్లి రోజు రాత్రి వీరు గోవాకు వెళ్లడం, అక్కడ వచ్చే సాంగ్ లా కనిపిస్తుంది. KV అనుదీప్ లిరిక్స్ అందించగా భీమ్స్ వాయిస్, మ్యూజిక్ తో అదరగొట్టేశాడు.

 

ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా అంత ఎక్కువ ప్రమోషన్స్ మాత్రం చేయడం లేదని కనిపిస్తుంది. స్వాతి రెడ్డి సాంగ్ కన్నా ఈ సినిమాలో సాంగ్స్  పెద్దగా నోటెడ్ అవ్వలేదు. పార్ట్ 1 కామెడీ కన్నా ఎక్కువగా ఈ సినిమాలో ఉందని అనుకుంటున్నారు. అందులో ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో మ్యాడ్ బాయ్స్ ఎలాంటి విజయాన్ని  అందుకుంటారో చూడాలి.