Last Updated:

Prabhas Project K: బిగ్ సర్‌ప్రైజ్‌ లోడింగ్.. ప్రాజెక్ట్-K అంటే ఏంటి?

Prabhas Project K: ప్రభాస్ ఈ పేరువింటే చాలు టాలీవుడ్లో రికార్డులన్నీ బద్దలవడం ఖాయం. పోయిన నెల ఆదిపురుష్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. తాజాగా సలార్‌ టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.

Prabhas Project K: బిగ్ సర్‌ప్రైజ్‌ లోడింగ్.. ప్రాజెక్ట్-K అంటే ఏంటి?

Prabhas Project K: ప్రభాస్ ఈ పేరువింటే చాలు టాలీవుడ్లో రికార్డులన్నీ బద్దలవడం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి అశేష ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు ఈ డార్లింగ్. పోయిన నెల ఆదిపురుష్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. తాజాగా సలార్‌ టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. జస్ట్ ఒక్క టీజర్‌తోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు యంగ్ రెబల్ స్టార్. 24 గంటల్లో 83 మిలియన్స్ వ్యూస్, రెండు రోజుల్లో 100 మిలియన్ మార్క్ టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రభాస్. అయితే ఇప్పుడు తాజాగా అందురూ చర్చించుకుంటున్న సినిమా ఏంటంటే ప్రాజెక్ట్ కె. ఇక ఈ సినిమా నుంచి బిగ్ అనౌన్స్మెంట్ లోడ్ అవుతోంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె రూపొందుతున్న విషయం తెలిసిందే.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీలో విలన్‌గా కనిపించనున్నాడు. రీసెంట్‌గానే కమల్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారని మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. కాగా తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని అందుకుంది.

ప్రాజెక్ట్ కె అంటే ఏంటి(Prabhas Project K)

జూలై 20న శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలో ప్రాజెక్ట్ కె టైటిల్‌ రివీల్ చేయనున్నారు. ఇదో ప్రౌడ్ మూమెంట్ అని ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ వేడుకలకు ప్రభాస్, కమల్‌,అమితాబ్‌, దీపికా, నాగ్ అశ్విన్ పాల్గొననున్నారు. ఇకపోతే అసలు ప్రాజెక్ట్ కె అంటే ఏంటి ప్రజలు తెగ చర్చించుకుంటారు. అందుకే మేకర్స్.. ప్రాజెక్ట్ కె అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా? అంటూ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. What is #ProjectK… The world wants to know! Come Kloser…First drop today at 7:10 PM (IST)/ 6:40 AM (PST) అని ట్వీట్ చేశారు. ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో ఈరోజు సాయంత్రం ప్రాజెక్ట్ కె నుంచి సాలిడ్ అప్ డేట్ రానుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.