Last Updated:

MM Keeravani: మేము కేవలం ఉత్సవ విగ్రహాలంటూ కీరవాణి భావోద్వేగం

ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీపరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాంకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ ప్రముఖులు, 24 క్రాఫ్ట్స్ సాంకేతిక నిపుణులెందరో హాజరయ్యారు.

MM Keeravani: మేము కేవలం ఉత్సవ విగ్రహాలంటూ కీరవాణి భావోద్వేగం

MM Keeravani: ‘ఆర్ఆర్ఆర్’ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచాన్ని తెలుగు సినిమావైపు చూసేలా చేసింది ఈ సినిమా. అత్యున్నత సినీ పురస్కారమైన ఆస్కార్ ను టాలీవుడ్ కు దక్కేలా చేసిన మూవీ. తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కి చేర్చింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయ్యింది. వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసిన ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జాబితాలో ఆస్కార్ అవార్డ్ దక్కిన విషయం కూడా తెలిసిందే.

దీనికి గానూ ప్రపంచవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి , సినీగేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. దీనికిగానూ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీపరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాంకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ ప్రముఖులు, 24 క్రాఫ్ట్స్ సాంకేతిక నిపుణులెందరో హాజరయ్యారు.

MM-Keeravani.jpg

వారు గుడిలో దేవుళ్లు(MM Keeravani) ..

ఇక ఇందులో భాగంగా కీరవాణి మాట్లాడుతూ తాము కేవలం ఉత్సవ విగ్రహాలు మాత్రమే మూలవిగ్రహాలు మాత్రం రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ అని చెప్పుకొచ్చారు. నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ రావడానికి ప్రధాన కారణం రాజమౌళి, ప్రేమ్‌రక్షిత్‌ అని చెబుతాను. వారు మూల విగ్రహాలలాంటివారు. వారి తరుఫున సత్కారాలు, సన్మానాలు, అభినందనులు అందుకోవడానికి నేను చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని ఆయన వివరించారు. ఇక చిత్ర పరిశ్రమంతా ఒక చోట చేరి ఇలా సంతోషంగా గడపడం ఎంతో ఆనందంగా ఉందని.. ఏదో ఒక వంకతో అన్ని క్రాఫ్ట్స్ వాళ్లు ఇలా అప్పుడప్పుడు కలుసుకోవడం అనేది ఎంతో ఆరోగ్యకరంగా భావిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. పండుగ వాతావరణం మళ్లీ మళ్లీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కీరవాణి భావోద్వేగానికి లోనయ్యారు.