RRR Actor : ఆర్ఆర్ఆర్ నటుడు “రే స్టీవెన్ సన్” మృతి.. నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". దర్శక ధీరుడు రాజమౌళి తెరేకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని ఆకట్టుకోని ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తెలుగుతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కూడా యాక్ట్ చేసిన విషయ తెలిసిందే.
RRR Actor : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం “ఆర్ఆర్ఆర్“. దర్శక ధీరుడు రాజమౌళి తెరేకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని ఆకట్టుకోని ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తెలుగుతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కూడా యాక్ట్ చేసిన విషయ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా నటించిన “రే స్టీవెన్ సన్” అందరికీ గుర్తు ఉండే ఉంటారు. అయితే అనారోగ్య సమస్యలతో స్టీవెన్ కన్నుమూశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన వయస్సు 58 సంవత్సరాలు.
అనారోగ్య సమస్యలతో ఇటలీలో చికిత్స తీసుకుంటూ మే 22 రాత్రి మరణించారు. రే స్టీవెన్ సన్ (RRR Actor) మరణంతో హాలీవుడ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి. స్టీవెన్ 25 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పలు బ్రిటన్, హాలీవుడ్ సినిమాలలో నటించారు. కింగ్ ఆర్థర్ (2004), ది అదర్ గైస్ (2010), థోర్ (2011), ది ట్రాన్స్‌పోర్టర్: రీఫ్యూయెల్డ్ (2015), యాక్సిడెంట్ మ్యాన్ (2018) లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. అదే విధంగా ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. కాగా ఆయన మృతికి సంతాపంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నివాళులు అర్పించారు. పలువురు హాలీవుడ్, బ్రిటన్ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా స్టీవెన్ సన్ కు నివాళులు అర్పిస్తున్నారు.
What shocking news for all of us on the team! 💔
Rest in peace, Ray Stevenson.
You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi
— RRR Movie (@RRRMovie) May 22, 2023
ఇక ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న వసిహాయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నమే సీనియర్ నటుడు శరత్ బాబు మరణించారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వారికి కూడా దగ్గరైన స్టీవెన్ సన్ (RRR Actor) మరణించడం మరింత బాధను కలిగిస్తుంది.