Published On:

Jack Movie: పాబ్లో నెరుడా సాంగ్.. జానీ మాస్టర్ స్టెప్పులు.. సిద్దు స్టైల్.. వేరే లెవెల్

Jack Movie: పాబ్లో నెరుడా సాంగ్.. జానీ మాస్టర్ స్టెప్పులు.. సిద్దు స్టైల్.. వేరే లెవెల్

Jack Movie:  డీజే టిల్లు తరువాత సిద్దు జొన్నలగడ్డ  రేంజ్ మొత్తం మారిపోయిన విషయం తెల్సిందే. టిల్లు స్క్వేర్ తో  స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమా తరువాత సిద్దు వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సిద్దు నటిస్తున్న చిత్రాల్లో జాక్ ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

జాక్ మూవీ ఏప్రిల్ 10 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. పాబ్లో నెరుడా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఏ ఉప్పెనలు చూడక్కర్లా.. తన ఉత్సహం చూస్తే చాలదా అంటూ సాగిన ఈ సాంగ్ అదిరిపోయింది. హీరో క్యారెక్టర్ గురించి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.

 

పాబ్లో నెరుడా అంటూ సాగిన ఈ గీతానికి వనమాలి లిరిక్స్ అందించగా.. బెన్నీ దయాల్  తన వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు. ఇక అచ్చు రాజమణి మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇక సాంగ్ మొత్తానికి హైలైట్ అంటే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అనే చెప్పాలి. గతేడాది నుంచి జానీ మాస్టర్ వివాదం ఎంత పెద్ద రచ్చ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

జానీ మాస్టర్.. తన లేడీ అసిస్టెంట్ ను లైంగికంగా వేధించిన కేసులో ఆయనకు జైలుకు వెళ్ళాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ.. ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీలో ఫోకస్ చేస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఆయన సిద్దు జొన్నలగడ్డతో వర్క్ చేశాడు. ఈ సాంగ్ లో జానీ స్టెప్పులకు సిద్దు స్టైల్ కూడా తోడయ్యి.. చాలా క్లాస్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.