Last Updated:

Mega star Chiranjeevi: సినిమాల్లోనే కాకుండా సీరియాల్లోను మెరిసిన మన మెగాస్టార్ చిరంజీవి గారు

మనమందరం అన్నయ్య అని ముద్దుగా చిరంజీవి గారిని పిలుచుకుంటాం. ఎవరి సపోర్ట్ లేకుండా తన కష్టంతో మెగాస్టార్‌గా మలుచుకున్న గొప్ప మనసున్న వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. పెద్ద అన్న ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను మెగాస్టార్ ఏలేరు. కష్టపడే తత్వం ఉన్న మనిషి. ఎప్పుడూ నేర్చుకునే స్వభావం కలిగిన వారు.

Mega star Chiranjeevi: సినిమాల్లోనే కాకుండా సీరియాల్లోను మెరిసిన మన మెగాస్టార్ చిరంజీవి గారు

Tollywood: మనమందరం అన్నయ్య అని ముద్దుగా చిరంజీవి గారిని పిలుచుకుంటాం. ఎవరి సపోర్ట్ లేకుండా తన కష్టంతో మెగాస్టార్‌గా మలుచుకున్న గొప్ప మనసున్న వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. పెద్ద అన్న ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను మెగాస్టార్ ఏలేరు. కష్టపడే తత్వం ఉన్న మనిషి. ఎప్పుడూ నేర్చుకునే స్వభావం కలిగిన వారు. సినిమా నటన వృత్తి పట్ల ప్రత్యేక విశ్వాసం. ఆయన నమ్మిన ఆత్మవిశ్వాసం చిరంజీవిని ఎప్పుడూ పైన ఉండేలా చేశాయి. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చిన వారికి, ఎదగాలనుకునే వారికి చిరు ఒక గొప్ప ఇన్స్పిరేషన్. మెగాస్టార్. డ్యాన్స్ చేస్తే విజిల్ వేయాలిసిందే. కామెడీ చేస్తే నవ్వులు పండాలసిందే. ఫైట్ చేస్తే రఫ్ ఆడాలిసిందే. మొత్తానికి చిరు చేయిస్తే చినిగి చిరిగి చేటావ్వాలిసిందే.

చిరు ఈజ్ డిఫరెంట్ స్టార్. ఆగస్ట్ 22 న చిరు అన్నయ్య బర్త్ డే. దీంతో అభిమానులందరు పెద్ద పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికి బాస్ అంటే అదే మాస్. అదే గ్రేస్, దేనిలో కూడా తగ్గేదేలే. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ తర్వాత విలన్ వేశాలు వేసి హీరోగా మారారు. 150 పైగా సినిమాలు చేశారు .

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పేజీను రాసుకున్నారు. అయితే చిరు కెరియర్ మొదట్లో ఓ హిందీ సీరియల్లో కూడా నటించారని మీకు తెలుసా, అవునండి ఇదే నిజమే. ఈ విషయం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. హిందీ సీరియల్ రజిని అనే సిరియాల్లో చిరు నటించారు. బిగ్ స్క్రీన్ మీదనే కాకుండా స్మాల్ స్క్రీన్‌పై కూడా మన అన్నయ్య మెరిశారు. అయితే అది అతిథి పాత్ర మాత్రమే. ఒక్క ఎపిసోడ్‌కు మాత్రమే పరిమితం. ఆ తర్వాత పలు సినిమాల్లో వరుస ఆఫర్స్ రావడంతో అలా చిరంజీవిగా మొదలు పెట్టి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు.

ఇవి కూడా చదవండి: