Actress Vasuki : 23 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ చెల్లి.. ఆ మూవీ తోనే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ "తొలిప్రేమ" సినిమాని ఎవరూ అంతా ఈజీగా మర్చిపోలేరు. కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించగా, పవన్ చెల్లెలు బుజ్జి పాత్రలో వాసుకి అద్భుతంగా నటించింది. సినిమా సూపర్‌హిట్ కావడం, వాసుకీ పాత్రకు మంచి పేరు రావడంతో ఆమె మరికొన్ని
Actress Vasuki : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ “తొలిప్రేమ” సినిమాని ఎవరూ అంతా ఈజీగా మర్చిపోలేరు. కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించగా, పవన్ చెల్లెలు బుజ్జి పాత్రలో వాసుకి అద్భుతంగా నటించింది. సినిమా సూపర్‌హిట్ కావడం, వాసుకీ పాత్రకు మంచి పేరు రావడంతో ఆమె మరికొన్ని సినిమాల్లో నటిస్తుందని భావించారు. ముఖ్యంగా మన ఇంట్లో చెల్లి మాదిరిగానే ఆమె సహజ నటన అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే సీన్ లో తన నటనతో వాసుకి ఏడిపించేసింది. అయితే ఆమె నటనకు గుడ్‌బై చెప్పేసి అదే సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన పవన్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయ్యారు. అయితే సుమారు 23 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇస్తుంది వాసుకి.
యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తోన్న “అన్నీ మంచి శకునములే” మూవీలో హీరో సోదరి పాత్రలో కనిపించనుంది వాసుకి. నందని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్వప్న సినిమా, విందా మూవీస్ సంస్థల పై స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమాని మే 18న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వాసుకీ తన రీఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
View this post on Instagram
‘తొలిప్రేమ’ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయని, వాటిలో తనకు నచ్చిన కథలు కూడా ఉన్నాయని, కానీ చేయడం కుదరలేదని వాసుకి చెప్పారు. పైగా ‘తొలిప్రేమ’ సినిమాలో నటించేప్పుడు నా వయసు 18 ఏళ్లు. ఆ తర్వాత మరే సినిమాల్లోనూ నటించలేదు. ఇంకా ఆ నెక్స్ట్.. పెళ్లి, పిల్లలు, వారి చదువులతోనే సరిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నత విద్య కోసం విదేశాల్లో ఉన్నారు. నేను కావాలనుకున్నది చేయవచ్చు అనిపించింది. పైగా అశ్వనీదత్ కుటుంబంతో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. స్వప్న, ప్రియాంక స్నేహితులు. ఈ సినిమాలో నా పాత్రకు మంచి పేరొస్తుందని అనుకుంటున్నా. మనసుకు నచ్చిన పాత్రలు దొరికితే తప్పకుండా సినిమాలు చేస్తా’ అని చెప్పుకొచ్చింది వాసుకీ.
అదే విధంగా తాను మల్టీ టాస్కర్‌ను కాదని.. అన్ని పనులూ ఒకేసారి చేయలేనని అన్నారు. పిల్లలు, వాళ్ల చదువులకే తన మొదటి ప్రాధాన్యత అని అన్నారు. కూతురు హర్ష మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతోందని.. కొడుకు సందీప్ ఆర్కిటెక్చర్ రెండో సంవత్సరంలో ఉన్నాడని ఆమె తెలిపారు. ఇక ఆనంద్ సాయి ఆయన పనిలో బిజీగా ఉంటారని.. ఇప్పుడు ఏదైనా చేయడానికి తనకు సమయం దొరికిందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో నందిని రెడ్డి ఈ కథతో తన వద్దకు వచ్చారని.. కథ నచ్చడంతో అంగీకరించానని అన్నారు. సినిమాలతో పాటు చదువుపై కూడా తాను దృష్టి పెట్టానని చెప్పిన వాసుకి.. ప్రస్తుతం సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నానని చెప్పారు.