Home /Author M Rama Swamy
Donald Trump : యాపిల్ తయారీ ప్లాంటు తరలివస్తాయని భారత్ గంపెడాశలు పెట్టుకుంది. ఆశలు ఆవిరయ్యాయి. ఇక ఇండియాకు నిరాశే మిగిలేట్లు ఉంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా టిమ్‌కుక్‌తో మాట్లాడారు. భారత్‌కు యాపిల్ తయారీ ప్లాంటు తరలించొద్దని కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. తనకు టిమ్ కుక్‌తో నిన్న చిన్న సమస్య ఎదురైందని చెప్పాడు. అతడు భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారని, అలా చేయడం తనకు ఇష్టం లేదని […]
Shock for YCP in Kadapa : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇవాళ ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్ జగన్‌తో మాట్లాడించాలని మూడునెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోవడం లేదని చంద్ర తెలిపారు. అనుచరుల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకంటున్నట్లు చెప్పారు. ఆయన […]
Supreme Court serious about Minister Vijay Shah : భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వ్యాఖ్యలు వివాదం కావడంతో కేసు నమోదైంది. అనంతరం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి తీరును తప్పుపట్టింది. హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని సూచనలు చేసింది. మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం.. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి […]
IPL 2025 : ఇండియా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులపాటు బీసీసీఐ వాయిదా వేసింది. ఐపీఎల్ తిరిగి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు దక్షిణాఫ్రికా గుడ్‌న్యూస్ చెప్పి భారీ ఊరట కల్పించింది. మొదట దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌కు ఈ నెల 26వ తేదీ వరకే అందుబాటులో ఉంటారని ప్రకటించింది. జూన్‌లో […]
President Draupadi Murmu : రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తుండటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు జాప్యానికి గురికావడంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీం తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం ఈ మేరకు […]
Chhattisgarh : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతం తెలిపారు. బుధవారం బీజాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన 21 రోజుల్లో 31 మంది మావోలు మృతిచెందారని పేర్కొన్నారు. 16 మంది మహిళా మావోలు ఉన్నట్లు తెలిపారు. మావోలపై రూ.1.72 […]
CM Revanth Reddy : ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజినీర్లు ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన […]
Pakistan’s letter to India : ఇప్పుడు పాక్ కాళ్లబేరానికి వచ్చింది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలివేయడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాక్‌కు జరిగిన నష్టం గురించి ఇప్పుడు తెలుసొచ్చింది. మొన్నటి వరకు సింధూ జలాల అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన పాక్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినా సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ప్రకటించింది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని […]
Madhya Pradesh High Court : భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, రెండు దేశాలు యుద్ధం ప్రకటించాయి. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో పాక్ స్థావరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రిపై కేసు నమోదు చేయాలని […]
Turkey-Pakistan : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు సాయం చేసిన తుర్కియేపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి నుంచి వస్తువుల దిగుమతి నిలిపివేయాలని ‘బాయ్కాచ్ తుర్కియే’ నినాదంతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో తుర్కియేకు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను ఎర్డోగాన్ అభినందించారు. పాక్ తమ నిజమైన విత్ర దేశమన్నారు. గతంలో మాదిరిగా భవిష్యత్‌లో అండగా ఉంటామని […]