Home /Author Mallikanti Veerabhadram
Karnataka: కర్ణాటకలోని హోస్కోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వాసులుగా గుర్తించారు. కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4), మూడు నెలల చిన్నారి చనిపోయారు. […]
Boston: మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘటన మరిచిపోక ముందే మరో విమానం త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని బోస్టన్ లో ఇవాళ జరిగింది. అమెరికాలోని బోస్టన్ లో లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వే పై ఓ విమానం అదుపుతప్పింది. రన్ వే నుంచి జారి పక్కకు దూసుకుపోయింది. ఘటనలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో […]
Telangana: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించే టీజీ సీపీజీఈటీ 2025 ఎంట్రెన్స్ పరీక్ష నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీజీ పీజీఈటీ 2025 సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ కుమార్ మొలుగరామ్ […]
Mumbai to London Air India flight to Return due to Iran – Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు సమాధానంగా ప్రతికార చర్యలకు దిగేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకు తిరిగి […]
PM Modi Visits Ahmedabad Plane Crash Spot: అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా విమాన ప్రమాద వివరాలను అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడి సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోదీ పరామర్శించారు. […]
Free Prasadam in Yadagirigutta Temple: భక్తుల సౌకర్యార్థం యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరి నర్సన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా పులిహోర, లడ్డూ పంపిణీ చేయాలని దేవస్థానం భావిస్తోంది. రేపటి నుంచి ఈనెల 30 వరకు ట్రయల్ రన్ నిర్వహించనుంది. అంతా సవ్యంగా జరిగితే.. జూలై 1 నుంచి వారంలో ఆరు రోజులు పులిహోర, శనివారం నాడు పులిహోరతో పాటు లడ్డూ ప్రసాదాన్ని సైతం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఈవో వెంకట్ […]
Israel Military Strike on Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ పై దాడులకు దిగింది. న్యూక్లియర్ సెంటర్స్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇవాళ ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొట్టందుకు ఇరాన్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపింది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ […]
PM Modi Visits Plane Crash Spot Ahmedabad: ప్రధాని నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. కాగా నిన్న అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన 265 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది కన్నుమూశారు. రమేశ్ విశ్వాస్ అనే వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయిన వారిలో 229 మంది ప్రయాణికులు కాగా, 12 మంది విమాన సిబ్బంది, […]
Atishi Marlena: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఆప్ సీనియర్ నేత, మాజీ సీఎం అతిశి నియోజకవర్గమైన కల్కాజీలోని గోవింద్ పురి జుగ్గి క్లస్టర్ లో అక్రమంగా నిర్మించిన 1200కు పైగా గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. కాగా ప్రభుత్వ తీరుపై ఆప్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని మాజీ సీఎం అతిశి ఆరోపించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టు […]
Hall Tickets: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. టెట్ పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేది వివరాలు అఫిషియల్ వెబ్ సైట్ లో నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి ఆన్ లైన్ లో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి 11.30 మొదటి సెషన్, మధ్యాహ్నం 2 […]