Home /Author Mallikanti Veerabhadram
Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా స్పెయిన్ కు చెందిన టెన్నిస్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. నిన్న హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నెం. 1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ ను 5 సెట్ల భారీ ఫోరులో మట్టికరింపించాడు. ఫైనల్ మ్యాచ్ మొత్తం 5.29 గంటలపాటు సాగింది. కాగా అల్కరాజ్ మొదటి రెండ్లు సెట్లలో వెనకబడినప్పటికీ మిగిలిన మూడు సెట్లలో ప్రత్యర్థి సిన్నర్ కు చుక్కలు చూపించాడు. 4-6, 6-7 […]
Congress: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కానున్నారు. అయితే తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై చర్చించేందుకేనని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుకోసమే ఈరోజు ఉదయం 10.20 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. కొత్త మంత్రులకు ఎలాంటి శాఖలు అప్పగిస్తారనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకున్న శాఖల […]
Kacheguda Railway Station: వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన కాచిగూడ రైల్వేస్టేషన్ ను ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే రూ. 2.23 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. నేడు సాయంత్రం 5.30 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభిస్తారు. ఈ రైల్వేస్టేషన్ కు విజువల్ హైలెట్ గా, వారసత్వ చిహ్నంగా మార్చేందుకు జాతీయతను ప్రతిబింబించే థీమ్ తో […]
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను ఆపారు. లుకౌట్ నోటీసులు అమలులో ఉండటంతో, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ వద్ద పాస్ పోర్ట్ స్కానింగ్ సమయంలో అధికారులకు సమాచారం వెళ్లింది. దీంతో ఆయన ఇమ్మిగ్రేషన్ వివరాలను ప్రాసెస్ చేసిన అనంతరం.. ఇంటికి […]
Tirupati: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు ఆదివారం ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. పురాణాల ప్రకారం ఆదివారం సూర్యదేవుడిని ఆరాదిస్తుంటారు. అలాగే సూర్యదేవునికి ఏడు సంఖ్య ఎంతో ప్రీతి అని వేద పండితులు చెప్తుంటారు. అలాంటిది ఆదివారం, బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరించడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తజనులు చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలతో భక్తిని చాటుకున్నారు. అలాగే […]
Annamayya District: అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో 48 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా దుంగలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఇవాళ తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆదేశాలతో డీఎస్పీ బాలిరెడ్డి, ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి బృందం అటవీ […]
Corona Virus: దేశంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు పాజిటీవ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో ఈ ఏడాది కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య ఆరు వేలను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిస్తోంది. కరోనా జాగ్రత్తలను పక్కాగా అమలు చేయాలని ఆదేశిస్తోంది. మరోవైపు తాజాగా నమోదవుతున్న కరోనా వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో […]
Maharastra: కాంగ్రెస్ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంచి కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠాక్రే పార్టీలు ఘోరంగా ఓడిపోయాయని అన్నారు. ప్రజలు వారిని తిరస్కరించారని.. అందుకే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారని అన్నారు. ఓటమిని ఒప్పుకోవాలి […]
AP: తెలుగు రాష్ట్రాల్లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని.. ఈ మధ్యే కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకులు గోదావరి స్నానానికి వెళ్లి ఎనిమిది మంది చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన మరువక ముందే నిన్న తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారెజీ వద్ద గోదావరిలో మునిగి ఆరుగురు గల్లంతయ్యారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగింది. ఏపీలో […]
Telangana: అనారోగ్యంతో నాలుగు రోజులుగా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం మాగంటి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. […]