Home /Author Thammella Kalyan
రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. అసలు రేవంత్ పాదయాత్ర చేస్తారా.. ఈ యాత్రకు సీనియర్లు సహకరిస్తారా అనే సందిగ్ధత కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతుంది.
పెద్దపల్లికి చెందిన మినీ హైడల్ స్టేషన్ పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు.. ఎన్పీడీసీఎల్ ముందుకొచ్చింది. ఇందులో ఒక్కో యూనిట్ రూ. 3.16 కు కోనుగోలు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నిర్ణయించింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమి మూటగట్టుకున్న శ్రీలంక.. ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ఇండియా పేరుమీద ఉన్న రికార్డును శ్రీలంక అధిగమించింది. కోల్ కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ గెలవగా.. లంక ఓడిపోయింది.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కొమురవెల్లి మల్లన్న దేవాలయం. ఈ ఆలయంలో ఉత్సవాలు సంక్రాంతి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సావాలు జరుగుతాయి.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు వెంటవెంటనే వెనుదిరిగారు.
శ్రీకాకుళం సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ప్రణాళిక వేశారని.. సుపారీ కూడా ఇచ్చారని వెల్లడించారు. రంగస్థలం సినిమాలో లానే తనను చంపేందుకు కుట్ర చేశారని పవన్ ఆరోపించారు.
ఒక దేశపు సంపద నదులు కాదు ఖనిజాలు కాదు.. కలల ఖనిజాలతో చేసిన యువత అని ప్రసంగాన్ని ప్రారంభించారు పవన్. రణస్థణంలో జరుగుతున్న సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
Janasena Yuvashakthi: రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తుందని.. వైసీపీ నాయకులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని జనసేన నాయుకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. ప్రతిపక్షా నాయకులపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన రాష్ట్రంలో వైసీపీ రహిత పాలనే తమ లక్ష్యమని.. సుపారిపాలనే తమ ధ్యేయమని ఆయన అన్నారు. ఇక ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా యువత, జనసేన కార్యకర్తలు […]
Janasena Yuvashakthi: వైసీపి పాలనే అంతంగా యువత పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని పవన్ కళ్యాణ్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మాట్లాడుతు.. రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన నడుస్తుందో సభా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ వివరించారు. ఇక విజయనగరానికి చెందిన హుస్సేన్ ఖాన్ అనే యువకుడు […]