Last Updated:

RR vs RCB: ఆర్సీబీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన రాజస్థాన్.. బెంగుళూరు ఘన విజయం

172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. రాజస్థాన్  జైపూర్ లోని స్వామీ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడి బెంగుళూరు టీం ఘన విజయం సాధించింది.

RR vs RCB: ఆర్సీబీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన రాజస్థాన్.. బెంగుళూరు ఘన విజయం

RR vs RCB:  172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. హెట్ మెయిర్ (35) రూట్(10) తప్ప మిగిలిన వారంతా వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. రాజస్థాన్  జైపూర్ లోని స్వామీ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడి బెంగుళూరు టీం ఘన విజయం సాధించింది. ఆర్ఆర్ కెరియర్లో ఇది సెకెండ్ లోయెస్ట్ స్కోర్ అని చెప్పవచ్చు. ఆర్సీబీ బౌలింగ్లో ఘన విజయం సాధించింది. ఫార్నెల్ 3 తీయగా బ్రేస్వెల్, కర్ణ్ చెరో రెండు వికెట్లు తీశారు. జంపా, ఆసిఫ్, సందీప్ శర్మ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్, డుప్లెసిస్ చెరో హాఫ్ సెంచరీ చేశారు.

ఈ విజయంతో బెంగుళూరు జట్టు పాయింట్ల పట్టికలో 6 మ్యాచులు గెలిచి 12 పాయింట్లతో ఐదోస్థానంలో ఉండగా రాజస్థాన్ జట్టు 13 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది.

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 14 May 2023 06:22 PM (IST)

    59రన్స్ తో ఆర్ఆర్ టీం ఆలౌట్

    10.3 ఓవర్లలో 59రన్స్ తో ఆర్ఆర్ టీం ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ ఘన విజయం సాధించింది.

  • 14 May 2023 06:03 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఆర్ఆర్

    7 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్ఆర్ టీం కీలక బ్యాటర్లను కోల్పోయింది. జురేల్ ఔట్ అయ్యాడు 7 బంతుల్లో 1 పరుగు చేసి జురేల్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆర్ఆర్ స్కోర్ 31/6

  • 14 May 2023 06:00 PM (IST)

    పవర్ ప్లే: ఆర్ఆర్ స్కోర్ 28/5

    పవర్ ప్లే ముగిసే సరికి ఆర్ఆర్ స్కోర్ 28/5. ప్రస్తుతం క్రీజులో హెట్ మెయిర్, జురేల్ ఉన్నారు.

  • 14 May 2023 05:57 PM (IST)

    ఈసారి రూట్ ఔట్

    రూట్ ఔట్ అయ్యాడు. 15 బంతుల్లో 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్ఆర్ స్కోర్ 28/5.

  • 14 May 2023 05:50 PM (IST)

    పడిక్కల్ ఔట్

    3 బంతుల్లో 4 పరుగులు చేసి పడిక్కల్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆర్ఆర్ స్కోర్ 20-4.

  • 14 May 2023 05:39 PM (IST)

    రూట్ నాటౌట్

    రూట్ నాటౌట్. ప్రస్తుతం ఆర్ఆర్ స్కోర్ 11/3.

  • 14 May 2023 05:34 PM (IST)

    శాంసన్ ఔట్

    రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 5 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆర్ఆర్ స్కోర్ 7/3.

  • 14 May 2023 05:31 PM (IST)

    బట్లర్ వికెట్ డౌన్

    2 బంతుల్లో 0 పరుగులు చేసి బట్లర్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 6-2.

  • 14 May 2023 05:26 PM (IST)

    జైస్వాల్ వికెట్ డౌన్

    మొదటి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ టీం. యంగ్ హిట్టర్ యశస్వి జైస్వాల్ 2 బంతుల్లో 1 పరుగు కూడా చెయ్యకుండా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రాజస్థాన్ టీం స్కోర్ 1-1.

  • 14 May 2023 05:24 PM (IST)

    ఛేజింగ్ మొదలు పెట్టిన ఆర్ఆర్

    ఛేజింగ్ మొదలు పెట్టిన ఆర్ఆర్. క్రీజులో జైస్వాల్, బట్లర్ ఉన్నారు.

  • 14 May 2023 05:07 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 172

    ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. దానితో రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 172.

  • 14 May 2023 04:56 PM (IST)

    మ్యాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్

    సందీప్ బౌలింగ్లో మ్యాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 33 బంతుల్లో 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 137/5. క్రీజులో రావత్, బ్రేస్ వెల్ ఉన్నారు.

  • 14 May 2023 04:52 PM (IST)

    మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ

    మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ బాదాడు. 30 బంతుల్లో 52 పరుగులు పూర్తి చేశాడు. 17 ఓవర్లు ముగిసే సరికి ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 134/4.

  • 14 May 2023 04:46 PM (IST)

    కార్తీక్ ఔట్

    ఆర్సీబీ బ్యాటర్లు వరుసగా వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరుతున్నారు. దినేష్ కార్తీక్ 2 బంతుల్లో ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 120/4. క్రీజులో మ్యాక్స్ వెల్, బ్రేస్ వెల్ ఉన్నారు.

  • 14 May 2023 04:43 PM (IST)

    వచ్చీ రాగానే లోమ్రోర్ ఔట్

    వచ్చీ రాగానే లోమ్రోర్ ఔట్ అయ్యాడు. 2 బంతుల్లో 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 120/3.

  • 14 May 2023 04:41 PM (IST)

    15 ఓవర్లు: ఆర్సీబీ స్కోర్ 120/2

    15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్ 120/2. ప్రస్తుతం క్రీజులో మ్యాక్స్ వెల్, లోమ్రోర్ ఉన్నారు.

  • 14 May 2023 04:39 PM (IST)

    ఆర్సీబీ కెప్టెన్ ఔట్

    అసిఫ్ బౌలింగ్లో 44 బంతుల్లో 55 పరుగులు చేసి ఫాఫ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 119/2.

  • 14 May 2023 04:37 PM (IST)

    డుప్లెసిస్ హాఫ్ సెంచరీ

    41 బంతుల్లో 51 పరుగులు చేశాడు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 115/1.

  • 14 May 2023 04:15 PM (IST)

    10 ఓవర్లు: ఆర్సీబీ స్కోర్ 78/1

    10 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్ 78/1. ప్రస్తుతం క్రీజులో మ్యాక్స్ వెల్, డుప్లెసిస్ ఉన్నారు.

  • 14 May 2023 04:00 PM (IST)

    కోహ్లీ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    మొదటి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ. కొహ్లీ 19 బంతుల్లో 18 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 50/1.

  • 14 May 2023 03:24 PM (IST)

    టాస్ గెలిచిన బెంగళూరు

    టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.