Toyota Innova Hycross: పుష్పగాడి హైప్.. టయోటా ఇన్నోవా హైక్రాస్.. సేల్స్‌లో బిగ్గెస్ట్ రికార్డ్..!
Toyota Innova Hycross: భారతీయ ఆటో మార్కెట్లో ఎమ్‌పివి సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి వాహనాల పేర్లను ముందుగా తీసుకుంటారు. ఇటీవల ఇన్నోవా హైక్రాస్ లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. ఇది టయోటాకు పెద్ద విజయం. కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి నవంబర్ 2022లో విడుదల చేశారు. ఈ ఎమ్‌విపి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కస్టమర్లను ఆకర్షిస్తుంది. కేవలం 2 సంవత్సరాలలో ఇది లక్ష యూనిట్ల విక్రయాల మార్కును దాటింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి 50,000 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అధిక డిమాండ్ కారణంగా ఈ కారు వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగింది. దాని పెట్రోల్ వేరియంట్ డెలివరీకి 6 నెలలు పడుతుంది. హైబ్రిడ్ వేరియంట్ డెలివరీకి 8 నెలలు పడుతుంది.
Toyota Innova Hycross Price And Specifications
దేశీయ విపణిలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.77 లక్షల నుండి రూ. 30.98 లక్షల మధ్య ఉంటుంది. మీరు దీన్ని GX(O), VX, VX(O), ZX, ZX(O) వంటి వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు.
ఇన్నోవా సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ వంటి అనేక ఆకర్షణీయమైన కలర్స్‌లో వస్తుంది. ఇన్నోవా హైక్రాస్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ 7-సీట్లను సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు ఇష్టమైనదిగా పరిగణిస్తున్నారు.
ఈ ఎమ్‌పివి 2-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 186 పిఎస్ హార్స్ పవర్‌ను రిలీజ్ చేస్తుంది. దీనితో e-CVT గేర్‌బాక్స్ ఎంపిక అందుబాటులో ఉంది. మరో 2-లీటర్ న్యాచురల్లీ ఆశ్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 175 పిఎస్ పవర్, 209ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి 16.13 నుండి 23.24 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో 7 మంది కూర్చునే సౌకర్యం ఉంది. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫైనల్‌గా ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ఫ్రంట్-రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.