Home / వైరల్ వీడియొలు
జార్ఖండ్‌కు చెందిన ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క పుట్టినరోజును గొప్ప వైభవంగా మరియు ఉల్లాసంగా జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ముద్దుల, తెదాపా అధినేత చంద్రబాబు నాయుడి కోడలు, నారా లోకేష్ భార్య అయిన నారా బ్రాహ్మణి లద్దాఖ్‌లో బైక్ రైడ్ చేసి అందరినీ అబ్బురపరిచారు. బ్రాహ్మణికు బైక్ రైడింగ్ అంటే ఇష్టం. ఆమె ఒక ప్రొఫెషినల్ బైక్ రైడింగ్ గ్రూపులో మెంబర్ కూడా. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో పాల్గొన్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 సూపర్ సక్సెస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వారం షో లో భాగంగా లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో కొత్త ఎపిసోడ్ రాబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ అందించింది ఆహా టీం.
కష్టించి పండించిన పంటకు మద్ధతు ధర రాకపోతే ఆ రైతన్న ఆవేదన వర్ణనాతీతం. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా ఆయనకు అన్ని ఖర్చులు పోయి చివరకు చేతికి అందింది కేవలం రూ. 8.36 పైసలు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఓ రసీదు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఫొటోలో కనిపిస్తున్న యువకుడు కూడా వర్క్ ఫ్రమ్ హోంలో పనిచేస్తూనే, మరోవైపు పెళ్లినాటి ప్రమాణాలు ఆచరిస్తుండడం సోషల్ మీడియా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు.
మనిషి తప్పు చేస్తే జీవిత ఖైదు విధించడం చూశాము. కానీ ఓ కోతికి కూడా జీవిత ఖైదు విధించారు. ఇకపై అది జీవితాంతం బోనులో ఉండాల్సిందే. అంతగా ఆ కోతి ఏం చేసింది ఎందుకు, ఎక్కడ దానికి జీవిత ఖైదు విధించారో ఓ సారి చూసేద్దాం.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్మార్ట్ ఫోన్ల యుగంలో చిన్నాపెద్దా అందరూ చరవాణీలకు అలవాటైపోయారు. దానితో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలుడు పెట్టిన స్టేటస్ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడానికి కారణమైంది.
ఒక బైక్ అంటే సాధారణంగా ఇద్దరు మహా అంటే ముగ్గురు వరకు ప్రయాణించేందుకు అనుకూలం. మూడో వారు కూర్చుంటేనే ఇరుకుగా ఉంటుంది. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన బైక్ పై భార్య, ఐదుగురు పిల్లలను, రెండు పెంపుడు కుక్కలు, లగేజీని తగిలించుకుని దర్జాగా వెళ్తున్నాడు.
చైనాలోని ఓ గొర్రెలు మంద గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. గత 12 రోజులుగా అలుపు సొలుపు లేకుండా నిరంతరాయంగా తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.