Last Updated:

Two infants died: మలక్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

Two infants died: మలక్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

Two infants died: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

అసలు ఏం జరిగింది

హైదరాబాద్ మలక్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం ఇద్దరు మహిళలు వచ్చారు.. చికిత్స అనంతరం ఇద్దరు మృతి చెందడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన సిరివెన్నెల భర్తతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి సిరివెన్నెల వెళ్లింది. వైద్యులు మహిళకు కాన్పు చేయగా.. ఆడబిడ్డ జన్మనిచ్చింది. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళా ప్రాణాలు విడిచింది. ఈ మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణమంటూ ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు.

తిరుపతికి చెందిన మరో మహిళా శివాణికి పురిటి నొప్పులు రావడంతో ఈ నెల 9న ఏరియా ఆస్పత్రికి తీసుకేళ్లారు. బాబుకు జన్మనిచ్చిన మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే అప్రమత్తమైన వైద్యలు ఆమెను గాంధీ ఆస్పత్రికి పంపించారు. గాంధీలో చికిత్స పొందుతూ శివాని సైతం మృతి చెందింది. ఈ రెండు మృతులకు మలక్ పేట్ వైద్యుల
నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళం చేపట్టారు.

వైద్యులు ఏమన్నారంటే?

వైద్యుల నిర్లక్ష్యం లేదని ప్రకటించిన వైద్యాధికారులు. ఇద్దరికి అనారోగ్య కారణల వల్లే మరణించారని వైద్యులు తెలిపారు.

సిరివెన్నెల అనే బాలింత శ్వాస తీసుకోవడం ఇబ్బంది వల్లే చనిపోయారని.. వైద్యుల నిర్లక్ష్యం లేదని తెలిపారు.

మరో మృతురాలు డయేరియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. శివానికి హైపోథైరాయిడ్‌ సమస్య ఉందిని.. దానివల్లే మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు.

బాలింతల మృతిలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు చెప్పిన వివరణపై బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. బాలింతల మృతిపై ఆర్డీఓ ప్రకటించిన రూ.5 లక్షల సాయన్ని సైతం తిరస్కరించారు. తమకు రూ.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వద్ద పోలీసులతో బాధిత కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బయటకు తోసేశారు.

ఈ ఘటనపై మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల స్పందించారు. వైద్యాధికారులతో చర్చిస్తామని.. బాధితులకు సరైన పరిహారం అందజేస్తామని తెలిపారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/