Home / ap news
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా ఛానల్లు విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్లతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ $600 మిలియన్ల విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసింది మరియు అదే సంవత్సరంలో 836,000 టన్నుల మిర్చిని ఉత్పత్తి చేసింది.
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి పాలంకి బ్రదర్స్ షాకిచ్చారు. వైసిపి వీడి వారిద్దరూ జనసేనలో చేరారు. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో పాలంకి సారధిబాబు, మోహన్ బాబు జనసేనలో చేరారు. జనసేన జెండా కప్పి పాలంకి బ్రదర్స్ ను ఆయన సాదరంగా ఆహ్వానించారు.