Home / Andhra Pradesh
పాపికొండల విహార యాత్ర ను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చినా బోట్లు మాత్రం కదలడం లేదు. ప్రభుత్వం యూజర్ చార్జీలు పెంచడమే దీనికి కారణమని తెలుస్తోంది.
మాజీ సర్పంచ్ సచివాలయం గుమ్మానికే ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చెంగుబళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్ తన పొలానికి దారి సమస్య పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో రుషికొండను కళ్లారా చూడాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లించడంలేదని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ నెల 23న ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది.
మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. పోలవరాన్ని పరిగెత్తిస్తామని తొడలు కొట్టిన నాటి వైకాపా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాటలు నీటిమూటలగానే మిగిలిపోయాయి. అనంతరం ఆయన స్థానంలో వచ్చిన మంత్రి అంబటి సైతం పోలవరం నిర్మాణంపై ఓ క్లారిటీ ఇవ్వలేకపోయారు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సహకరించారన్న కారణంగా ఇప్పటం గ్రామం పై వైకాపా ప్రభుత్వం కక్షకట్టిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే గ్రామంలో రోడ్డు వెడల్పు సాకుతో సుమారుగా 53 ఇండ్లను పూర్తిగా, పాక్షికంగా నేలమట్టం చేశారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కిషన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నరసింహకొండలోని వేదగిర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్వరలో మంగళగిరి ఎయిమ్స్ ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి . అనంతపురం జిల్లా కలెక్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ కలెక్టర్ నాగలక్ష్మీ పై విమర్శలు చేశారు.