CM Chandrababu: ప్రజల సంతృప్తి మాకు పరమావధి: సీఎం చంద్రబాబు
CM Chandrababu: పౌరసరఫరాల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సంతృప్తే పరమావధిగా తీర్చిదిద్దాలన్నారు. రేషన్ సరుకుల పంపిణీ, దీపం-2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు నిర్దేశించారు.
ప్రజలు పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ, జీఎస్‌డబ్ల్యుఎస్ డేటాలో లేని 79వేల, 173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి సరిచేయాలన్నారు. మరోవైపు, రైస్ కార్డులకు సంబంధించి ఈనెల 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర కింద సేవలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.