CN Chandrababu: రేపు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన
CN Chandrababu: రేపు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం ముమ్మిడివరం చేరుకోనున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రేపు ఉదయం 10 గంటలకు బయలుదేరి 12 గంటల 25 నిమిషాలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటల 50 నిమిషాలకు సిహెచ్. గున్నేపల్లి చేరుకుంటారు.
హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబును ప్రజా ప్రతినిధులను అధికారులు కలుస్తారు. చెరువు పూడికతీత పనులను పరిశీలించి ప్రజలు ప్రజాప్రతినిధులతో ప్రజావేదికలో ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత పేదల సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిహెచ్. గున్నేపల్లి గ్రామస్తులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆ తర్వాత పార్టీ క్యాడర్ మీటింగుకు హాజరవుతారు. అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులపై సమీక్షించారు. సీఎం చంద్రబాబు రేపు కోనసీమలోని ముమ్మిడివరం వస్తున్న నేపథ్యంలో రైల్వే ప్రాజెక్ట్‌పై స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రంతో సంప్రదించి, పనులు త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ, కోటిపల్లి వద్ద గోదావరిపై బ్రిడ్జి గడ్డర్స్ పనులు ప్రారంభం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రైల్వే లైన్ ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.