Last Updated:

Rajya Sabha: రాజ్యసభలో డబ్బుల కలకలం.. కాంగ్రెస్ ఎంపీ దొరికేశాడు!

Rajya Sabha: రాజ్యసభలో డబ్బుల కలకలం.. కాంగ్రెస్ ఎంపీ దొరికేశాడు!

Currency notes found from Congress MP Abhishek Singhvi’s seat, orders probe: రాజ్యసభలో డబ్బుల కలకలం చోటుచేసుకుంది. ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర నగదు లభ్యమైంది. రూ.500 నోట్ల కట్టను సెక్యూరిటీ గుర్తించింది. నగదు లభ్యంపై చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సింఘ్వీ పేరు ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికార, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాగా, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ వివరాల ప్రకారం.. గురువారం సభ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే సాధారణ విచారణలో ఓ ఎంపీ సీటు కింద నోట్ల కట్టలు భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రస్తుతం ఈ సీటు నంబర్ 222 కాగా, ఇది తెలంగాణ స్టేట్ నుంచి ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారన్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే దర్యాప్తు చేసేందుకు ఆదేశించినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, సీటు కింద రూ.500 నోట్ల కట్టతో పాటు రూ.100నోట్ల కట్టనుకూడా గుర్తించామని చైర్మన్ ధన్ ఖడ్ వివరించారు. అయితే ఈ నోట్లు ఒరిజినల్ లేదా నకిలీవా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయాన్ని చెప్పేందుకు తన బాధ్యత అన్నారు. కానీ ఈ విషయంపై రాజ్యసభలో వాగ్వాదం చోటుచేసుకుంది. సభ పూర్తికాకముందే పేరును ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. చైర్మన్ ప్రకటించిన విసయంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు.

మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు తప్పుబట్టారు. పేరు చెబితే తప్పంటి అనే విధంగా ప్రశ్నించాడు. ఏ సీటు దగ్గర దొరికింది?అక్కడ ఎవరు కూర్చుంటారనే విషయం చైర్మన్ చెప్పారన్నారు.ఇందులో తప్పేముంది. సభకు నోట్ల కట్టలతో రావడం సరికాదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయతే నతపై వచ్చిన ఆరోపణలను ఎంపీ అభిషేక్ సింఘ్వీ ఖండించాడు. నేను కేవలం రూ.500 నోటు మాత్రమే తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.