Home / ఐపిఎల్
ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్-16లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన 163 పరుగుల లక్ష్యాన్ని.. 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.
DC vs GT: ఐపీఎల్ లో నేడు మరో పోరుకు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికైంది. గుజరాత్ టైటాన్స్, దిల్లీ జట్టు మధ్య నేడు పోటి జరగనుంది. ఇక ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై బౌలర్లపై సీరియస్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో బౌలర్లు.. ఎక్కువ వైడ్స్, నో బాల్స్ వేశారు. దీనిపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మార్చుకోకపోతే.. కెప్టెన్ గా ఉండనని హెచ్చరించాడు.
ఐపీఎల్ సీజన్ 16 లో ఢిల్లీకి తాత్కాలిక కెఫ్టెన్ గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టాడు. అయితే హౌం గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు జరిగేటపుడు..
దాదాపు నాలుగేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సొంత గ్రౌండ్ లో బరిలోకి దిగింది. దీంతో స్టేడియం అంతా చెన్నై అభిమానులతో పోటెత్తింది.
ఐపీఎల్ 2023 సీజన్లో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై అదరగొట్టేసింది. ఇరగదీసే బ్యాటింగ్.. ఆకట్టుకునే బౌలింగ్.. అన్నీ తోడై ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో ఐపీఎల్ 2023 లో ఫస్ట్ విక్టరీ ని అందుకుంది. చెన్నై జట్టు ఇచ్చిన 218 పరుగుల భారీ టార్గెట్ లక్నో ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేసింది.
ఐపీఎల్ 2023 భాగంగా లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
ఐపీఎల్ సీజన్ 16 లో రాయల్ చాలెంజర్స్ ఘనంగా బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో బెంగరూరు 8 వికెట్లతో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది.
ఏ సాలా కప్ నందే.. ఐపీఎల్ 16వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సూపర్ విక్టరీ తో ప్రారంభించి అభిమానులందరికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ని చిత్తుగా ఓడించింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించి మంచి బోణి కొట్టారు.
బెంగళూరు టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగింది. విరాట్ వర్సెస్ రోహిత్ సేనల పోరులో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.