Last Updated:

IND vs NZ 3rd ODI: భారత్ బ్యాటింగ్ జోరు.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్ను

IND vs NZ 3rd ODI: భారత్ బ్యాటింగ్ జోరు.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్ను

IND vs NZ 3rd ODI: న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. క్లీన్‌స్వీప్‌ చేసేందుకు భారత్ చేరువైంది. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది.

తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌తో కివీస్‌ను బెంబేలెత్తించింది. ఇక మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధించేలా కనిపిస్తోంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తే మాత్రం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న భారత్‌.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుతుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. బ్యాటింగ్ లో రాణిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో చెలరేగుతున్నారు. వీరిద్దరు పోటీ పడి పరుగులు చేయడంతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది.

మ్యాచ్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు.. ఆ తర్వాత రెచ్చిపోయారు. అవకాశం వచ్చినప్పుడల్లా సిక్సులు, ఫోర్లతో చెలరేగారు. దీంతో ఒక్కసారిగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ Ind vs Nz  ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 65 బంతుల్లో ఆరు సిక్సులు, 8 ఫోర్లతో సెంచరీకి చేరువ అవుతున్నారు. ఇక మరో బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ సైతం రాణిస్తున్నాడు. 57 బంతుల్లో మూడు సిక్సులు, ఆరు ఫోర్లతో 78 పరుగులతో ఆడుతున్నాడు.

టీమిండియా ఓపెనర్ల ధాటికి కివీస్ బౌలర్లు తెలిపోయారు. ప్రతి బౌలర్ దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు.

ఓపెనర్ల వికెట్ తీసేందుకు న్యూజిలాండ్ బౌలర్లు శ్రమిస్తున్నారు.

న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ నాలుగు ఓవర్లలో ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు.

పేసర్లతో పాటు పెద్దగా ప్రభావం చూపని న్యూజిలాండ్ స్పిన్నర్లు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/