Last Updated:

David Warner: జడేజా వర్సెస్ డేవిడ్ వార్నర్.. మైదానంలో నవ్వులే నవ్వులు

David Warner: ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడ్డు వర్సెస్ వార్నర్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరగిందింటే..

David Warner: జడేజా వర్సెస్ డేవిడ్ వార్నర్.. మైదానంలో నవ్వులే నవ్వులు

David Warner: దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ తమాషా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సన్నివేశం మెుత్తం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడ్డు వర్సెస్ వార్నర్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరగిందింటే..

బ్యాట్ తిప్పిన వార్నర్.. (David Warner)

దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ తమాషా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సన్నివేశం మెుత్తం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడ్డు వర్సెస్ వార్నర్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరగిందింటే..

దీపక్ చాహర్ వేసిన ఐదో ఓవర్లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఓవర్లో మూడో బంతిని వార్నర్ కవర్స్ దిశగా ఆడాడు. దీంతో వార్నర్ సింగిల్ తీశాడు.

అయితే మెుయిన్ అలీ త్రో వేయగా అది రహానే చేతిలోకి వెళ్లింది. వెంటనే మరో పరుగుకు వార్నర్ యత్నించాడు. రహానే బంతిని జడేజాకు వేశాడు.

అప్పటికే వార్నర్‌ క్రీజులోకి వెళ్లిపోయాడు. కానీ ఇక్కడే ఆ సరదా సన్నివేశం జరిగింది. చేతిలో ఉన్న బంతితో జడ్డూ త్రో వేస్తానని వార్నర్ ని బెదిరించాడు.

దీంతో వార్నర్ కూడా నాకేం భయం లేదంటూ.. జడేజా స్టైల్ లో బ్యాట్ తిప్పాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు.

కాసేపటికి వార్నర్‌ జడ్డూ స్టైల్లో బ్యాట్‌ను కత్తిలా తిప్పడం.. జడ్డూ కూడా తగ్గేదేలా అంటూ పుష్ప స్టైల్‌ను అనుకరించడంతో నవ్వులు విరపూశాయి.

వార్నర్‌, జడ్డూ చర్యను పిలిప్‌ సాల్ట్‌ సహా సీఎస్‌కే ఆటగాళ్లు బాగా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్ లో దిల్లీ 77 పరుగుల తేడాతో ఓడిపోయింది. వార్నర్ ఒక్కడే 86 పరుగులతో రాణించాడు.

ఈ సీజన్ లో వార్నర్ 500 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు.