Amigos Movie Review : కళ్యాణ్ రామ్ మళ్ళీ హిట్టు కొట్టినట్టేనా.. “అమిగోస్” మూవీ రివ్యూ, రేటింగ్ !
Cast & Crew
- కళ్యాణ్ రామ్ (Hero)
- ఆషికా రంగనాథ్ (Heroine)
- బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు (Cast)
- రాజేంద్ర రెడ్డి (Director)
- నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ (Producer)
- జిబ్రాన్ (Music)
- ఎస్. సౌందర్ రాజన్ (Cinematography)
Amigos Movie Review : బింబిసారతో హిట్ కొట్టిన “నందమూరి కళ్యాణ్ రామ్” ఎట్టకేలకు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
గతేడాదిలో విడుదలైన ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘అమిగోస్’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తుంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ మూవీతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
గతంలో బాలకృష్ణ సాంగ్ ని కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాలో రీమిక్స్ చేశాడు.
ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దీంతో బాబాయ్ సెంటిమెంట్ తో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడం గ్యారంటీ అని నందమూరి ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..
సినిమా కథ..
సిద్ధార్థ్ (కళ్యాణ్ రామ్) హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. ఆర్జేగా పనిచేసే ఇషిక (ఆషికా రంగనాథ్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఓ వెబ్‌సైట్ ద్వారా తన లాంటి పోలికలు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కలుస్తాడు. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ మంజునాథ్ అయితే.. మరోకరు బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్. ఈ ముగ్గురు గోవాలో కలుసుకొని బాగా క్లోజ్ అవుతారు. వీరు కలవడం కంటే ముందే బిపిన్ రాయ్ హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ అధికారిని దారుణంగా హత్య చేస్తాడు. ఆ మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికే సిద్దార్థ్‌కి మైఖేల్‌గా పరిచయం చేసుకుంటాడు. ఆ కేసులో తనకు బదులుగా సిద్దార్థ్‌ని అరెస్ట్ చేయించడమే అతని ప్లాన్. మరి అది వర్కౌట్ అయిందా? ఎన్‌ఐఏ అధికారులు ఎవరిని అరెస్ట్ చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? బిపిన్ రాయ్ వేసిన అసలు ప్లాన్ ఏంటి? అనేదే మిగతా కథ.
(Amigos Movie Review)మూవీ విశ్లేషణ..
బింబిసారతో చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ‘అమిగోస్’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది అని చెప్పాలి. సాధారణంగా తెలుగు తెరపై వచ్చిన చిత్రాల్లో ఇలా డ్యూయల్ రోల్, ట్రిపుల్ రోల్ లో పలువురు నటులు నటించి మెప్పించారు. కానీ వారి మధ్య సోదరులు అనే కాన్సెప్ట్ తో ఆ మూవీస్ వచ్చాయి. కానీ మొదటిసారిగా ఇదో కొత్త కాన్సెప్ట్ అనుకోని ఆడియన్స్ లో కూడా ఆసక్తి బాగా పెరిగింది. అయితే దర్శకుడు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు అని తెలుస్తుంది. కథ బాగానే ఉన్న కథనంలో ఊహించినంత ట్విస్ట్ లు లేకపోవడం సినిమాకి మైనస్ అని చెప్పాలి. ఈ చిత్రంలో ఒకే రూపంతో ముగ్గురు మనుషులు ఉంటారని.. వారిలో ఒకరు విలన్ అని, తన అవసరం కోసం మిగతా ఇద్దరిని వాడుకుంటాడని ట్రైలర్‌లోనే చూపించారు.
విలన్ కోసం ఎన్‌ఏఐ అధికారులు వెతకడం కూడా అందులో చూపించారు. అయితే ఎందుకు వెతుకుతున్నారు? వాళ్లు ఎలా కలిశారనేదే మిగతా కథ. ఆ కథను ఆసక్తికరంగా నడిపించే విషయంలో దర్శకుడు రొటీన్‌గా నడిపించాడు. పైగా రొటీన్ లవ్‌స్టోరీ ప్రేక్షకులను విసిగిస్తుంది. పస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఎలాంటి ట్విస్టులు, వావ్ మూమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ అక్కడ కూడా కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతాయి. దర్శకుడు కొత్త కాన్సెప్ట్‌నే ఎంచుకున్నాడు కానీ.. ఆసక్తికరంగా తెరపై చూపించడంలో కొంత విఫలమయ్యాడని అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని చెప్పాలి. సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్‌గా.. ఇలా మూడు పాత్రల్లోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. రెండు, మూడు నిమిషాలు మినహా తెరపై మొత్తం కళ్యాణ్ రామే కనిపిస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. మిగతా రెండు పాత్రలతో పోలిస్తే.. విలన్ గా చేసిన మైఖేల్ పాత్రలో కళ్యాణ్ రామ్ బాగా చేశారని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రిషిక పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ గ్లామర్ ట్రీట్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. ముఖ్యంగా ఎన్నో రాత్రులు సాంగ్ లో కుర్రకారు గుండెల్ని దోచుకుంది. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఎస్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఎన్నోరాత్రులు వస్తాయి కానీ..’ పాట రీమేక్ బాగా సెట్ అయింది.
కంక్లూజన్ (Amigos Movie Review)..
అన్ని బాగానే ఉన్న.. ఏదో తక్కువైంది..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/