Rudrangi Movie Review: “రుద్రంగి” మూవీ రివ్యూ ఎలా ఉందంటే.. జగపతి బాబు ప్రజలను అలరించాడా..?

Cast & Crew

  • జగపతిబాబు (Hero)
  • విమలా రామన్ (Heroine)
  • మమతా మోహన్ దాస్, ఆశిష్‌ గాంధీ, గణవి లక్ష్మణ్, ఆర్ఎస్ నందా తదితరులు (Cast)
  • అజయ్ సామ్రాట్ (Director)
  • డాక్టర్ రసమయి బాలకిషన్ (Producer)
  • నవ్ ఫాల్ రాజా (Music)
  • సంతోష్‌ షానమోని (Cinematography)
2.5

Rudrangi Movie Review: ఒకప్పటి స్టార్ హీరో.. టాలీవుడ్‌ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంతకగానో ఆకట్టుకున్న జగ్గు భాయ్.. ఇప్పుడు విలన్‌ గా రాణిస్తున్నారు. కాగా తాజాగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. నూతన డైరెక్టర్ అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమతా మోహన్ దాస్, విమల రామన్ కీలక పాత్రలలో నటించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

సినిమా కథ(Rudrangi Movie Review)

ఈ ‘రుద్రంగి’ చిత్రం 1940వ కాలం నాటి తెలంగాణలో దొరల పరిపాలన బ్యాక్ డ్రాప్ లో రూపొందించబడినది. కాగా, రుద్రంగి అనే సంస్థానంలో ఆడవారిపై అమితమైన మోహం కలిగి.. తన ప్రాంత ప్రజలను ఎలాంటి దయ లేకుండా పాలించే దొర బీమ్ రావు దేశముఖ్ (జగపతిబాబు) మీరాబాయి (విమల రామన్) పెళ్లి చేసుకుంటాడు. కాగా తనకి ఉన్న కామంతో మరో స్త్రీ అయిన జ్వాలా భాయ్ (మమతా మోహన్ దాస్)ని కూడా పెళ్లి చేసుకుంటారు. అయితే జ్వాలా తాలూకా స్వభావం నడవడిక ఏవీ భీమ్ రావుకు నచ్చకపోవడంతో ఆమెను దూరంగా ఉండమని చెప్తాడు. అయితే ఓ రోజు భీమ్ రావు వేటకి వెళ్లినప్పుడు అక్కడ పొలాల్లో రుద్రంగి (గానవి లక్ష్మణ్) అనే మరో అమ్మాయిని చూసి ఆమె అందం పట్ల మోహితుడు అవుతాడు.

దీనితో ఆమెతో ఎలాగైనా సరే శారీరక సుఖం పొందాలని అనుకుంటాడు. మరి ఈ ప్రక్రియలో ఆమె కోసం భీమ్ రావు చేస్తున్న చర్యల్లో భాగంగా ఓ ఊహించని నిజాన్ని తెలుసుకుంటాడు. మరి అది ఏంటి? ఆమెను తను వశపరచుకుంటాడా లేదా అసలు చివరికి ఏం జరిగింది అనేది అసలు కథ. ఈ సినిమా మల్లేష్, రుద్రంగి బాల్య వివాహంతో కథ మరింత ఎమోషనల్ గా మారుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు దొరసానుల మానసిక సంఘర్షణని, వారి ఫీలింగ్స్ ని, గడీల లోపల జరిగే విషయాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

భీమ్‌ రావు పాత్రలో జగపతిబాబుని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. ఆయన అద్భుతంగా నటించారు. దొరగా పర్‌ఫెక్ట్ సెట్‌ అయ్యారు. పాత్రకి ప్రాణం పోశారు. మల్లేష్‌ పాత్రలో ఆశిష్‌ గాంధీ బాగా మెప్పించారు. కానీ ఆయన పాత్రని ఇంకా బలంగా రాసుకోవాల్సింది. మరోవైపు జ్వాలాబాయ్‌గా మమతా మోహన్‌దాస్‌ నటన వాహ్‌ అనిపిస్తుంది. మమతా మోహన్‌దాస్‌ ఉన్న సీన్లలో ఆమె డామినేషనే కనిపిస్తుంది. మరోవైపు దొర పెద్ద భార్య మీరాబాయ్‌ పాత్రలో విమలా రామన్‌ నటన ఆకట్టుకుంటుంది. మరోవైపు రుద్రంగి పాత్రలో గనవి లక్ష్మణ్‌ సినిమాకి మరోపెద్ద అసెట్‌ అనే చెప్పాలి. ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా చాలా ఇంపాక్ట్ ని చూపించింది.

ప్లస్‌ పాయింట్స్‌

కథ
నటీ నటులు
దర్శకత్వం

మైనస్‌ పాయిట్స్‌

ఎమోషన్‌ సీన్స్‌
సాగదీత