Bangaluru Rave Party:బెంగళూరులో రేవ్‌పార్టీ గుట్టురట్టైంది. బర్త్‌డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. రేవ్ పార్టీలో ప్రముఖులు, బడాబాబులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. పార్టీలో డ్రగ్స్, మత్తుపదార్థాలు లభ్యమయ్యాయి. రేవ్ పార్టీలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు పట్టుబడ్డారు. వారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
నేను రేవ్ పార్టీకి వెళ్లలేదు.. నటుడు శ్రీకాంత్ ( Bangaluru Rave Party)
ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యే కాకాణి స్టిక్కర్‌తో కారు ఉంది. అయితే.. స్టిక్కర్ ఉన్న కారు తనది కాదని కాకాణి తెలిపారు. మరోవైపు రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్టీలో నటి హేమ ఉన్నట్టు కన్నడ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే.. రేవ్ పార్టీ ఆరోపణలను హేమ ఖండించింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్టు హేమ వెల్లడించింది. మరోవైపు బెంగళూర్ రేవ్ పార్టీ దృశ్యాలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ స్పందించారు. తాను ఎలాంటి రేవ్ పార్టీకి వెళ్లలేదని..తాను హైదరాబాద్‌లో ఉన్నానని వివరించారు. రేవ్ పార్టీ దృశ్యాల్లో తనను పోలిన వ్యక్తి ఉండటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని శ్రీకాంత్ తెలిపారు. దృశ్యాల్లో కన్పించే వ్యక్తి తాను ఒకటి కాదన్నారు. తానేనంటూ తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనని..హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. దీంతో నటి హేమపై మిస్ లీడ్ కేసుతో పాటు మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం హేమ పోలీసు స్టేషన్‌లో ఉన్నారు.
బెంగళూరులో ఆదివారం అర్దరాత్రి జరిగిన రేవ్ పార్టీ ఘటన ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా మెంబర్స్ ఆ పార్టీలో పాల్గొన్నారని సమాచారం. ఇక వీరందరూ ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. ఈ లిస్ట్‌లో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. కన్నడ మీడియా సమాచారం ప్రకారం నటి హేమ కూడా అదుపులో ఉన్నారని సమాచారం. ఇక బయటకు వచ్చిన వీడియోలను బట్టి కొంత మందిని అంచనా వేస్తున్నారు.