Site icon Prime9

War 2 Updates : వార్2 నుండి క్రేజీ అప్డేట్ .. రిలీజ్ డేట్ ఫిక్స్,వచ్చేది ఎప్పుడంటే ?

jr.ntr and Hrithik Roshan Spy Universe Movie War 2 Release Date

jr.ntr and Hrithik Roshan Spy Universe Movie War 2 Release Date

War 2 Updates : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . హృతిక్ గతంలో నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకొని మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. అయితే హీరోలు లేకుండానే ఈ షెడ్యూల్ పూర్తి అయ్యింది. హీరోలు లేని సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ చిత్రీకరించారు. త్వరలోనే హృతిక అండ్ ఎన్టీఆర్ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారట. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అని అభిమానులంతా ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

తాజాగా వార్ 2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారట. ఈ విషయాన్ని ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తెలియజేశారు. ఈ చిత్రం 2024లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుందని అందరూ భావించారు. కానీ అభిమానుల ఎదురుచూపులను మరికొంచెం పొడిగిస్తూ.. ఈ మూవీ రిలీజ్ 2025కి వెళ్ళింది. ఆగష్టు 14న 2025లో ఈ మూవీ రిలీజ్ కానుందట. ఆ రిలీజ్ డేట్ లాంగ్ వీకెండ్ తో వస్తుంది.ఈ భారీ మల్టీస్టారర్ మూవీని ఇండిపెండ్స్ డే సందర్భంగా ఆగష్టు 14 న విడుదల చేయనున్నారు. 14న గురువారం నాడు మూవీ రిలీజ్ చేయగా 15న ఇండిపెండెన్స్ డే హాలిడే, 16,17 వీకెండ్. దీంతో వార్ 2కి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

కాగా ఈ మూవీ YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర చేస్తున్నాడని సమాచారం. స్పై యూనివర్స్ మొత్తానికి ఎన్టీఆర్ మెయిన్ విలన్ కాబోతున్నారట. ప్రస్తుతం ఈ సినిమాటిక్ యూనివర్స్ లో హీరోలుగా ఉన్న సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్.. ఎన్టీఆర్ ని ఓడించడానికి కలిసి పోరాటం చేయనున్నారట. ఇటీవల రిలీజ్ అయిన టైగర్ 3 చివరిలో ఒక కొత్త విలన్ గురించి ఆడియన్స్ కి తెలియజేశారు. ఆ విలన్ ఎన్టీఆర్ అంటున్నారు. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి రెడీ అయ్యాడు .

Exit mobile version