Last Updated:

Chinna Movie Review : హీరో సిద్ధార్థ్‌ “చిన్నా” మూవీతో విజయం సాధించాడా..? రివ్యూ, రేటింగ్ ??

Chinna Movie Review : హీరో సిద్ధార్థ్‌ “చిన్నా” మూవీతో విజయం సాధించాడా..? రివ్యూ, రేటింగ్ ??

Cast & Crew

  • సిద్ధార్థ్ (Hero)
  • నిమిషా సజయన్ (Heroine)
  • సహస్ర శ్రీ, అంజలి నాయర్ తదితరులు (Cast)
  • ఎస్.యు. అరుణ్ కుమార్ (Director)
  • సిద్ధార్థ్ (Producer)
  • నేపథ్య సంగీతం : విశాల్ చంద్రశేఖర్.. స్వరాలు : దిబు నినన్ థామస్, సంతోష్ నారాయణన్ (Music)
  • బాలాజీ సుబ్రమణ్యమ్ (Cinematography)
3.5

Chinna Movie Review : హీరో సిద్దార్థ్.. బాయ్స్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి ఎన్నో చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. తాజాగా హీరో సిద్దార్థ్ నటించిన తమిళ సినిమా ‘చిత్తా’. సెప్టెంబర్ 28న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు `చిన్నా` అనే మూవీతో ఓ సెన్సిటివ్‌ సబ్జెక్ట్ తో వస్తున్నారు. దీనికి ఆయనే నిర్మాత కావడం విశేషం. ఎస్‌ యు అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో.. రివ్యూలో తెలుసుకుందాం.

మూవీ కథ.. 

చిన్నా అలియాస్‌ ఈశ్వర్‌(సిద్ధార్థ్‌) మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటారు. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాప చిట్టిలకు సపోర్ట్ గా ఉంటాడు. చిట్టినీ రోజూ స్కూల్‌కి డ్రాప్ చేయడం, పికప్‌ చేసుకుంటాడు. మున్సిపల్‌ డిపార్ట్ మెంట్‌లోనే పనిచేసే శక్తి(నిమిషా సజయన్‌) తో లవ్ లో పడతాడు. ఓ రోజు చిట్టి, తన స్నేహితురాలు మున్ని పాడుబడ్డ గుడి సమీపంలో జింకలు ఉన్నాయి, చూద్దామని ఇద్దరు ప్లాన్‌ చేసుకుంటారు. కట్‌ చేస్తే చిట్టి మధ్యలోనే వచ్చేస్తుంది. ఒంటరిగా మున్ని వెళ్తుంది. అప్పట్నుంచి మున్ని భయపడుతూ సైలెంట్‌గా ఉంటుంది. ఆ పాపపై అత్యాచారం జరిగిందని తేలుతుంది. దానికి చిన్నానే కారణం అని అంతా నమ్ముతారు. అతన్ని చిత్తకొట్టి పోలీస్‌ స్టేషన్‌లో పెడతారు. వదిన కూడా అతన్ని అనుమానిస్తుంది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోతాడు చిన్నా. అంతలోనే చిట్టి కూడా మిస్‌ అవుతుంది. చిట్టిని స్నేహితుడు ఎస్‌ఐతో కలిసి చిన్నా వెతుకుతుంటాడు. ఈ క్రమంలో చివరికి చిన్నా ఏం చేశాడు? తనపై పడ్డ నిందకి సమాధానం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Chinna

సినిమా విశ్లేషణ (Chinna Movie Review).. 

ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులు గురించి అందరికీ తెలిసిందే. ఆడ పిల్లను ఒంటరిగా బయటికి పంపిస్తే తిరిగి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ఎంత భయపడుతున్నారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక మైనర్‌ బాలికలపై, చిన్నారులపై అత్యాచార ఘటనలు హృదయ విదారకంగా అనిపిస్తాయి. ఆ కాన్సెప్ట్ పై పూర్తి స్థాయిలో సిద్ధార్థ్‌ `చిన్నా` మూవీ చేశాడు. కథ నచ్చి ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సినిమా ప్రారంభంలో కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి టైమ్‌ తీసుకున్నారు దర్శకుడు. పాత్రలను, ఊరి వాతావరణాన్ని, చైల్డ్ అబ్యూజింగ్‌ ఘటనలు చూపించాడు. ఇలా సినిమాలోకి, దాని సీనియస్‌ నెస్‌లోకి ఆడియెన్స్ ని తీసుకెళ్లేందుకు కాస్త ఎక్కువ టైమ్‌ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక చిన్నా అత్యాచారం చేశాడనే ఆరోపణలతో కథ వేగం పుంజుకుంటుంది. ఇక అప్పటి నుంచి పూర్తిగా ఎమోషనల్‌ డ్రైవ్‌ తీసుకుంటుంది. సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయి. ప్రతి ఒక్కరూ పర్సనల్‌గా ఆ కథతో, సన్నివేశాలతో మనం బాగా కనెక్ట్ అవుతాం. మధ్యలో కొంచెం సీన్లు లాగ్ అవుతున్నాయ్ అని అనిపించినా కానీ చివర్లో ఎమోషనల్‌ సీన్లు, చిట్టి కోసం చిన్నా పడే బాధ మరింతగా కదిలిస్తుంది. సీరియస్‌నెస్‌లో డెప్త్ పెంచుతూ వెళ్లడంతో ఎమోషనల్‌ డోస్‌ మరింత పెరుగుతుంది. అవి కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి. క్లైమాక్స్ ని మరింత హై గా తీసి ఉంటే బాగుండేది. సినిమా కోసం సిద్ధార్థ్‌, దర్శకుడు ఎఫర్ట్స్ ని అభినందించాల్సిందే.

ఎవరెలా చేశారంటే..  

చిన్నా పాత్రలో సిద్ధార్థ్‌ పరకాయ ప్రవేశం చేశాడు. చాలా సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఓ కొత్త సిద్ధార్థ్‌ని చూపించాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. అర్థ నగ్న సీన్లు కూడా చేయడం అంటే ఈ కథని ఆయన ఎంతగా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. పాత్రకి, కథకి ఎంతవరకు కావాలో అంతగా చేసి మెప్పించాడు. తన బెస్ట్ ఇచ్చాడు. మధ్యతరగతి కుర్రాడిగా కనిపించి మనల్ని మనకు గుర్తు చేశాడు. చాలా వరకు కళ్లతోనే నటించి మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్లలో కన్నీళ్లు పెట్టించాడు. సిద్ధార్థ్‌ లవర్‌ పాత్రలో నిమిషా సజయన్‌ సైతం చాలా సహజంగా చేసింది. డీ గ్లామర్ రోల్‌లో మెప్పించింది. సిద్ధార్థ్‌ వదినగా అంజలి నాయర్‌ చాలా బాగా చేసింది. అలాగే చిన్నా ఫ్రెండ్‌ ఎస్‌ఐ పాత్ర దారి సినిమాకి మరో అసెట్‌. అతను అత్యంత సహజంగా నటించి మెప్పించాడు. మున్ని, చిట్టిలు చిన్న పిల్లలైనా సహజంగా చేసి ఆకట్టుకున్నారు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో విశాల్‌ చంద్రశేఖర్‌ న్యాయం చేశాడని చెప్పాలి. బాలాజీ సుబ్రమణ్యం కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌లో సిద్ధార్థ్‌ రాజీపడలేదు అని తెలుస్తుంది. అరుణ్‌ కుమార్‌ సినిమాని చాలా వరకు రియలిస్టిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయ్యాడు.

కంక్లూజన్..

ఆలోచింప చేసే చిత్రం.. మస్ట్ వాచ్

ఇవి కూడా చదవండి: