Last Updated:

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలకు వణుకు.. అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చిన జనసేన నేతలు

పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారని.. తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలకు వణుకు.. అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చిన జనసేన నేతలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారని.. తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని సర్వనాశనం చేసేందుకే వైసిపి పాలన సాగిస్తోందని.. వైసిపి పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ అమలవుతోందని.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే టీడీపీ – జనసేన కలిసి పనిచేస్తున్నాయని పవన్,చంద్రబాబు స్పష్టం చేశారని అన్నారు.

వైసీపీకి సింహస్వప్నంలా పవన్ కళ్యాణ్..

కుప్పంలో చంద్రబాబు ను అడ్డుకున్న తీరుపై పరామర్శ కు పవన్ వెళితే మీ ఇష్టానుసారం మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. పొత్తులు, సీట్ల కోసమే పవన్- చంద్రబాబు భేటి అయ్యారని అనడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పవన్ పేరు.. వైసీపీకి సింహస్వప్నంలా మారిందని.. రాష్ట్రంలో పవన్(Pawan Kalyan) అభిమానాన్ని చూసి మంత్రులకు నిద్ర సైతం పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అయ్యిందని దుర్గేష్ వ్యాఖ్యానించారు. వైసిపి నేతలు కావాలనే పవన్- చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారని.. అలాంటి వారికి తెదేపా కార్యకర్తలు.. జనసేన సైనికులు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. వైసిపి చేస్తున్నా అక్రమాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని.. అయినా తాము వెనక్కి తగ్గేది లేదన్నారు.

అంబటి రాంబాబుకి జనసేన కౌంటర్ 

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబుకి ఆయన కౌంటర్ ఇచ్చారు. మంత్రి అంబటి చిలక జోస్యం చెప్పుకోవడానికి వెళితే బాగుంటుందని చురకలు అంటించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి- జనసేన కలిసి పోటీచేస్తే కనీసం వైసీపీకి డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. కేవలం పవన్ ని విమర్శించడానికే కొందరు మంత్రులయ్యారని.. ప్యాకేజి గురించి మాట్లాడటం తప్పా మరేం వారికి రాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేయడానికే జీవో 1 తీసుకువచ్చారని.. కానీ వైసీపీకి ఆ జీవో వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి పక్షాల తీరుతో సీఎం జగన్ కి నిద్రపట్టడం లేదని దుర్గేష్ అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. గవర్నర్ పాలన విధించే పరిస్థితి వచ్చిందని దీనికి కారణం వైసిపి అరాచక పాలనే నిదర్శమన్నారు. కందుకూరు, గుంటూరులో చనిపోయిన కుటుంబాలను సీఎం ఎందుకు పరామర్శ చేయలేదని.. ప్రజల ప్రాణాలు పోతే సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర పరిస్థితులను బీజేపీ దృష్టికి పవన్ – చంద్రబాబు తీసుకువెళతారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన- తెదేపా కచ్చితంగా విజయం సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Director Bobby: నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్నయ్య.. పాలిటిక్స్ కు తమ్ముడు ఉన్నాడు.. డైరెక్టర్ బాబీ కామెంట్స్

Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: