Published On:

Simla Agreement: ఓడినా క్షమించాం.. 90వేల సైనికులను వెనక్కించాం

Simla Agreement: ఓడినా క్షమించాం.. 90వేల సైనికులను వెనక్కించాం

Simla Agreement: సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేయండం హాస్యాస్పదం. యుద్దంలో ఓడినవారే ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం చరిత్రలో మొదటిది కాబోలు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్దంలో పాకిస్తాన్ ఒడిన తర్వాత శాంతి యుత వాతావరణం నెలకొల్పడానికి ఏర్పడింది. అందులో భాగంగా, యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన 90వేల మంది పాక్ సైనికులను భారత్ విడిచిపెట్టింది.

 

ఈ యుద్దంలో పాకిస్తాన్ లోకి భారత్ చొచ్చుకెళ్లింది. ఎన్నో ప్రాంతాలను ఆక్రమించుకుంది. అప్పుడే  భారత్ పట్టుభిగించినట్లయితే పాకిస్తాన్ లోని చాలా ప్రాంతం భారత్ వశమయ్యేది. అయినా… సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భూభాగాన్ని భారత్ తిరిగి ఇచ్చేసింది. 90వేల మంది సైనికులను విడుదల చేసింది. కశ్మీర్ విషయంలో మరెవరి ప్రమేయం లేకుండా ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చలతోనే పరిష్కరించుకోవాలని అంగీరించాయి. ప్రస్తుతం ఉన్న లైన్ఆఫ్ కంట్రోల్ ను రెండు దేశాలు అతిక్రమించరాదని నిర్ణయించుకున్నాయి. అయితే పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒప్పందం రద్దు చేసుకోవడంతో లైన్ ఆఫ్ కంట్రోల్ పై పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది.

 

పహల్గాం దాడి జరిగిన తర్వాత పాక్ వింత చేష్టలు చేస్తుంది. దాడి చేసిన తీవ్రవాదులు పాకిస్తాన్ కు చెందిన వారని తెలిసినా వారిపై చర్యలు తీసుకోకుండా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతోంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ వెనక ఉండి నడిపించాడు. దాని అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ సభ్యులు పహల్గాం దాడిలో పాల్గొన్నారు. ఈ దాడిలో ఇద్దరు పాకిస్తానీలు, మరో ఇద్దరు జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారు ఉన్నారు. ఈ దాడిలో 26మంది సామాన్య పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు మద్దతునిచ్చాయి.

 

పాక్ ప్రధానిని ప్రశ్నించి పాకిస్తాన్ క్రికెటర్
పాకిస్తానీ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పహల్గాం దాడిపై పాక్ ప్రధాని షెహనవాజ్ ను ప్రశ్నించాడు. దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు అప్రమత్తమైందన్నారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ను ఉగ్రదేశంగా చూస్తున్నాయన్నారు. అమెరికా మాజీ పెంటగాన్ అధికారి ఇప్పటికే పాకిస్తాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు గుర్తుచేశాడు. దాడికి పాకిస్తాన్ కు సంబంధం లేకుంటే ఖండించాలని కోరాడు. పాక్ ప్రధాని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి: