Home / జాతీయం
RCB : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మృతిచెందిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నష్ట పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గాయపడిన వారి సహాయార్థం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. బుధవారం బెంగళూరులో జరిగిన దురదృష్టకర ఘటన ఆర్సీబీ కుటుంబానికి తీవ్ర బాధను కలిగించింది. ఈ ఘటనలో మృతిచెందిన 11 మంది కుటుంబాలకు […]
Karnataka High Court : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ప్రమాదం జరిగిన తీరును ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. ఘటన సమయంలో చిన్నస్వామి మైదానం పరిసర ప్రాంతాల్లో వెయ్యి మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నట్లు తెలిపింది. అంతకుముందు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు. ఆర్సీబీ కార్యక్రమానికి 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పడం గమనార్హం. తొక్కిసలాట ఘటనపై విమర్శలు […]
Chhattisgarh : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతిచెందారు. ఆయన సొంతగ్రామం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సుధాకర్‌పై రూ.50లక్షల రివార్డు ఉంది. 40ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. సుధాకర్ అలియాస్ సింహాచలం బీజాపూర్ జాతీయపార్కు వద్ద గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు […]
BJP Demand to CM Siddaramaiah, Deputy CM Shivakumar arrest : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా.. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. తాజాగా, కొంతమంది గతంలో జరిగన సంఘటనలకు ఈ ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని జోడించి చర్యలు ఉంటాయా? అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం సిద్ధరామయ్యతో పాటు […]
Mallikarjun Kharge : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇటీవల పాకిస్థాన్‌కు బెయిల్ఔట్ ప్యాకేజీలు, రుణాలు లభించిన సొమ్ము సైన్యం, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై వెచ్చిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పోషించే పాకిస్థాన్‌ను ఉగ్ర బాధిత దేశమైన భారత్‌తో పోల్చడం సరికాదన్నారు. పాక్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా […]
Karnataka Home Minister G. Parameshwara : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల కోసం 8 లక్షల మంది అభిమానులు తరలివచ్చారని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. దీంతో తొక్కిసలాటకు దారితీసిందన్నారు. విధానసౌధ బయట లక్ష మంది ఉంటారని అంచనా వేశామన్నారు. మైదానం వెలుపల 25 వేల మంది ఉంటారని భావించామన్నారు. 2.5 లక్షల మంది వస్తారని ఊహించలేదని తెలిపారు. బుధవారం 8.70 లక్షల మెట్రో టికెట్లు అమ్ముడు పోయాయన్నారు. అవన్నీ క్రికెట్ అభిమానులవే అనుకుంటే 8 […]
DK Shivakumar gets emotional : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సం సందర్భంగా తొక్కిసలాటలో టీనేజీ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఘటన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధను ఏ కుటుంబం భరించలేదన్నారు. పిల్లల మృతదేహాలపై రాజకీయాలా? తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 15 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం […]
New Rules in IRCTC Tatkal Ticket Booking in Future: ఐఆర్సీటీసీ మరో ముందడుగు వేయనుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. త్వరలోనే ఈ – ఆధార్ అథంటికేషన్ తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే కేవలం ఆధార్ ధృవీకరించిన అకౌంట్స్ నుంచి మాత్రమే ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తత్కాల్ టికెట్ […]
Aravali Green Wall Project: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దక్షిణ ఢిల్లీలోని ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ రీలాంచ్ చేశారు. అందులో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మోదీ మర్రిచెట్టును నాటారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని […]
Sukanya Samriddhi Yojana Scheme for Girls: కేంద్ర ప్రభుత్వం పొదుపులకు సంబంధించి ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఆడపిల్లల కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకంపై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేకపోవడంతో పొదుపు చేసుకునేందుకు దూరమవుతున్నారు. అయితే, ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ పథకం ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం. కేంద్రం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని బ్యాంకులు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉంటాయి. […]